ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghurama: సీబీఐ జోరు.. వైకాపా బేజారు.. హూ కిల్ బాబాయ్..

ABN, First Publish Date - 2023-04-16T13:24:09+05:30

ఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీబీఐ జోరు మా వైకాపా బేజారు.. హూ కిల్ బాబాయ్’ అంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం నుంచి హడావుడి ప్రారంభమైందన్నారు. గొడ్డలితో హత్య చేసిన వారిని అరెస్ట్ చేశారని, మరిన్ని ఆధారాలతో హత్యకు ముందు ఎవరెవరు కలిశారో, ఎక్కడ కలిశారన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ జరిగిందన్నారు. గూగుల్ టెక్ ఔట్ ద్వారా భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నారని స్పష్టంగా తేలిపోయిందన్నారు. మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు.

వివేకను హత్యచేసి గుండెపోటు అన్నారు.. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారని, ఫ్రీజర్‌లో పెట్టి రక్తం కనిపించకుండా పూలను సహితం ఏర్పాటు చేశారని రఘురామ అన్నారు. సునీత రెడ్డి భర్త చాలా స్పష్టంగా ఏపీ పోలీసులకు, సీఐడీ అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చారని, ఏదో డైవర్ట్ చేస్తున్నారని అదే రోజు అనుమానం వ్యక్తం చేశారన్నారు. సునీత రెడ్డి వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలని ఆయన కోరారన్నారు.

భాస్కర్ రెడ్డి స్వయంగా భారతి రెడ్డికి మేనమామ... సీటు ఎలాగూ అవినాష్ రెడ్డికి కన్ఫర్మ్ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు చంపడం అని రఘురామ ప్రశ్నించారు. ఈ హత్య కేసును టీడీపీ నేతలు బిటెక్ రవి, ఆది నారాయణ రెడ్డి మీదకు ముందు నెట్టివేయాలని చూశారు.. కానీ వాళ్లు సీబీఐ విచారణకు అడిగారన్నారు. ఇవాళ భాస్కర్ రెడ్డి అరెస్టు కావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి షాక్‌కు గురై ఉంటారని.. ఎందుకంటే మొదటి నుంచి ఆయన ఈ కేసుపై ఎక్కువగా మాట్లాడారన్నారు.

వైకాపా నేతలు ఆదివారం ఉదయం నుంచి ఎవరు మాట్లాడటం లేదు.. దురదుష్టకరమని, 48 గంటల్లో ఇంకో అరెస్ట్ ఉండే అవకాశం ఉందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. రేపు హైకోర్టులో జస్టిస్ సురేంద్ర ధర్మాసనం ముందు సునీత రెడ్డి తరపు వాదనలు ఉన్నాయని.. ఇది ఆమె విజయమన్నారు. నిజ దోషులు ఎవరన్నది సునీత రెడ్డికి తెలుసునని అన్నారు. ఇదే పట్టుదలతో ముందుకు వెళ్ళి తండ్రి రుణం తీర్చుకోవాలని.. ఆమె పోరాటం మహిళ లోకానికి ఆదర్శమని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-04-16T13:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising