ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Raghurama: అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యం: ఎంపీ రఘురామ

ABN, First Publish Date - 2023-05-22T15:55:55+05:30

న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) అరెస్టు (Arrest) తథ్యమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnamraju) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఢిల్లీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో (ABN Andhrajyothy) మాట్లాడుతూ ఈ విషయంలో సీబీఐ (CBI) అధికారులు సీరియస్‌గా ఉన్నారని, ఈరోజు అరెస్టు తథ్యమని మరోసారి స్పష్టం చేశారు. ఒకవేళ అవినాష్‌కు గుండెపోటు వచ్చిందని చెప్పి.. ఆపరేషన్ కూడా చేస్తున్నామని 10 మంది డాక్టర్లు యాక్షన్ చేస్తే తప్ప.. అరెస్టు ఆగదన్నారు.

అవినాష్ అరెస్టును అదృష్టశక్తులు అడ్డుకోలేవని పరోక్షంగా సీఎం జగన్‌ (CM Jagan)ను ఉద్దేశించి రాఘరామ అన్నారు. అదృష్ట శక్తులు అదృశ్యమైపోయాయని, ఇవాళ సాయంత్రంలోగా అవినాష్ అరెస్టు ఖాయమన్నారు. ఇక్కడ భయపడుతుంది అవినాష్ కాదని.. జగన్మోహన్ రెడ్డని అన్నారు. సీబీఐ విచారణకు హాజరవుదామని అవినాష్ హైదరాబాద్ వచ్చారని, కడప వెళ్లిపోమని సీఎం చెప్పగానే ఆయన తిరిగి పులివెందులకు బయలుదేరారన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-05-22T15:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising