Ugadi Wishes: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్
ABN, First Publish Date - 2023-03-22T07:29:37+05:30
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీ యువనేత నారా లోకేష్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: ఉగాది (Ugadi Festival) పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Naralokesh) రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయ పండగ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. శోభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభాలు కలగజేయాలని ఆకాంక్షించారు. తెలుగు లోగిళ్లు కొత్త శోభ సంతరించుకోవాలన్నారు. కొత్త ఆశయాలు నెరవేరి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నవ్యోత్సాహంతో ఉగాది జరుపుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు.
మరోవైపు లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) నిన్న (మంగళవారం) కదిరి నియోజకవర్గం (Kadiri Constituency)లో పూర్తి అయ్యింది. ఉదయం 49వ రోజు యువగళం పాదయాత్రను కదిరి ఆర్డీఓ కార్యాలయం (Kadiri RDO Office వద్ద విడిది కేంద్రం నుంచి మొదలుపెట్టారు. అంగన్వాడీ వర్కర్ల (Anganwadi workers)పై జగన్ సర్కారు (Jagan Government) దాష్టీకానికి నిరసనగా నల్ల బ్యాడ్జీ ధరించి పాదయాత్ర చేశారు. ఆపై ముత్యాలమ్మ చెరువులో టిడ్కో గృహాలను లోకేష్ పరిశీలించారు. కే.బ్రాహ్మణపల్లి, సుబ్బరాయుని పల్లి, పులగంపల్లి వద్ద ప్రజలు యువనేతతో కలిసి పాదయాత్ర చేశారు. ఆపై సాయంత్రం కదిరి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర పూర్తి అయి... పుట్టపర్తి నియోజకవర్గం (Puttaparthi Constituency) లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అఖండస్వాగతం పలికారు.
Updated Date - 2023-03-22T07:29:37+05:30 IST