TDP: ఎన్టీఆర్ శత జయంతి సభా ప్రాంగణానికి భూమి పూజ
ABN, First Publish Date - 2023-04-25T10:20:53+05:30
మహనీయుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు మే 28న జరుగనున్నాయి.
విజయవాడ: మహనీయుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు (NTR centenary celebrations) మే 28న జరుగనున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి సభ, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ నేతృత్వంలో ‘‘ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు’’ పుస్తకావిష్కరణ జరుగనుంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తాడిగడపవంద అడుగుల రోడ్‌లో సభా ప్రాంగణానికి టీడీపీ నేతలు (TDP Leaders) భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శత జయంతి కమిటీ చైర్మన్ టీడీ జనార్ధన్ (NTR Centenary Committee Chairman TD Janardhan) మాట్లాడుతూ... ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు వెంకట నారాయణ రచించిన ‘‘ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు & అసెంబ్లీ ప్రసంగాలు’’ పుస్తకం ఆవిష్కరణ ఉంటుందన్నారు. వెబ్‌సైట్, సావనీర్ హైదరాబాద్‌లో త్వరలోనే ఆవిష్కరిస్తామని చెప్పారు. ఈ సభకు చంద్రబాబు (Chandrababu), రజనీకాంత్ (Rajinikanth), బాలకృష్ణ (Balakrishna) పాల్గొంటారన్నారు. ఎన్టీఆర్ యాప్‌ను నారా లోకేష్ (Nara Lokesh)ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర: కొనకళ్ల నారాయణ (Konakalla Narayana)
ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర అని.. సినిమా, రాజకీయ రంగాల్లో ప్రత్యేక శైలి ఆయనదని తెలిపారు. చరిత్రలో గుర్తు ఉండిపోయేలా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. కమిటీ ఛైర్మన్ టి.డి.జనార్ధన్ ఆధ్వర్యంలో అనేక సభలు జరుపుతున్నారన్నారు. ప్రజలు కూడా ఎన్టీఆర్ చరిత్ర గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారని అన్నారు. నేటి తరం కూడా యన్టీఆర్ గురించి ఆసక్తిగా వినడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు.
సినీ, రాజకీయ రంగాల్లో రారాజు ఎన్టీఆర్: దేవినేని ఉమ (Devineni Uma)
సినీ, రాజకీయ రంగాల్లో రారాజు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో సీఎం అయిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. పేదలను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వంద సభలు నిర్వహించి, మే 28 శత జయంతిని గొప్పగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు పాల్గొంటున్నట్లు తెలియజేశారు.
ఆ ముగ్గురని ఒకేసారి చూడటం..: బోడె ప్రసాద్ (Bode prasad)
తన నియోజకవర్గంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్ ఒకే వేదిక మీద చూడటం కనుల విందుగా ఉంటుందన్నారు. లక్షలాది మంది అభిమానులు ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగం అవుతున్నారని తెలిపారు. ఎన్టీఆర్ చరిత్ర, ఆయన గొప్పతనం గురించి అందరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు.
Updated Date - 2023-04-25T10:28:47+05:30 IST