ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pattabhiram: దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడ్డా ఏపీలో మూలాలు..

ABN, First Publish Date - 2023-04-29T16:42:26+05:30

అమరావతి: దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడ్డా.. ఏపీలో మూలాలు బయటపడుతున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దేశంలో గంజాయి (Marijuana), డ్రగ్స్ (Drugs) ఎక్కడ పట్టుబడ్డా.. ఏపీలో మూలాలు బయటపడుతున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram) అన్నారు. శనివారం అమరావతి (Amaravathi)లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాజాగా సుమారు రూ. 750 కోట్లు విలువైన ట్రెమడాల్ డ్రగ్స్ (Tremadol Drugs) ఏపీ కేంద్రంగా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి అయి ఉండవచ్చని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయన్నారు. నరసారావుపేట కేంద్రంగా సేఫ్ ఫార్ములేషన్స్‌ (Safe Formulations)లో ఉత్పత్తి అయిన రూ. 21 కోట్ల విలువైన 10 లక్షల నిషేధిత ట్రెమడాల్ ట్యాబ్లెట్ స్ట్రిప్స్ ఫిబ్రవరి 27న ముంబయిలో పట్టుబడ్డాయన్నారు.

ఐఎస్ఐఎస్ (ISIS) డ్రగ్స్‌గా పిలవబడే ఈ ట్రెమడాల్ ట్యాబ్లెట్లను 2018 లోనే కేంద్రం నిషేధించిందని పట్టాభిరాం తెలిపారు. సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థలో ఈ ట్యాబెట్లను ఉత్పత్తి చేసి ఫస్ట్ వెల్త్ సొల్యూషన్స్ సంస్థ ద్వారా సౌత్ సూడాన్ రాజధాని జూబాకు ఎగుమతి చేయాలని జగన్ ముఠా (Jagan Gang) ప్రయత్నించిందని, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాతో కోట్ల రూపాయలు దండుకున్న జగన్ రెడ్డి (Jaganreddy) తన ముఠా సభ్యుల చేత అత్యంత నీచంగా మాదక ద్రవ్యాలు తయారు చేయిస్తూ వందల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.

తప్పుడు కేసులతో కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని వేధింపులకు గురిచేసి.. వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థను వారి వద్ద నుంచి బలవంతంగా జగన్ ముఠా 2019లో కబ్జా చేసిందని పట్టాభిరాం అన్నారు. 2019 వరకు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తూ మంచి పేరు సంపాదించుకున్న సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థను జగన్ ముఠా ఆ తర్వాత ఒక మాదకద్రవ్యాల ఉత్పత్తి కేంద్రంగా మార్చిందన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఈ కంపెనీని జగన్ ముఠా శనగల శ్రీధర్ రెడ్డి, బాలినేని గొవిందరెడ్డి, బాలినేని అరుణలను ముందుపెట్టి కంపెనీని బలవంతంగా లాక్కుని మాదక ద్రవ్యాలు తయారు చేయిస్తున్నారని ఆరోపించారు.

టెర్రరిస్టులు విపరీతంగా వాడే ఈ ట్రెమడాల్ డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మారడం విచారకరమని పట్టాభిరాం అన్నారు. డ్రగ్స్ మాఫియా వల్ల ‘కలెక్షన్ క్వీన్’ విడదల రజిని నుంచి తాడేపల్లి ప్యాలెస్‌లో పెద్దల వరకు అందరికీ ముడుపులు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఈ డ్రగ్స్‌ను తయారు చేయటం సాధ్యం కాదన్నారు. గతంలో ఒకసారి అంబటి రాంబాబు కూడా ఈ సేఫ్ ఫార్ములేషన్స్ కంపెనీని సందర్శించి వారిని వెనకేసుకొచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. నార్కోటిక్స్ బ్యూరో, కేంద్ర కస్టమ్స్ విభాగం సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి చర్యలకు ఉపక్రమిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంకా మొద్దునిద్రపోతోందని నిలదీశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్ డ్రగ్స్ మాఫియాపై సమగ్ర విచారణ జరిపించాలని పట్టాభిరాం డిమాండ్ చేశారు.

Updated Date - 2023-04-29T17:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising