ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Payyavula: సీఎం జగన్ కావాలనే కక్షతో వాటిని రద్దు చేశారు..

ABN, First Publish Date - 2023-05-18T16:36:48+05:30

అమరావతి: చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ (Current) ఒప్పందాల్లో తప్పులేదని, అంతా సక్రమంగానే జరిగాయని హైకోర్టు (High Court) చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కావాలనే కక్షతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ (Current) ఒప్పందాల్లో తప్పులేదని, అంతా సక్రమంగానే జరిగాయని హైకోర్టు (High Court) చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కావాలనే కక్షతో ఆ ఒప్పందాలను రద్దు చేశారని టీడీపీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒప్పందాలు కాదన్నందుకు బయట మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనడం ఒక తప్పయితే, విద్యుత్ కొనకపోయినా, ఒప్పందం ప్రకారం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డబ్బులు కట్టడం మరో పెద్దతప్పు అన్నారు. ఈ తప్పుల ఫలితాలకు బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. బ్యాక్ డోర్‌లో అధికధరకు విద్యుత్ కొన్నది... మీ దోపిడీకోసం కాదా? అని నిలదీశారు. ఒప్పందాల ప్రకారం విద్యుత్ కొనుగోళ్లు చేయకుండా, వాటిని ఉల్లంఘించి, రద్దు చేసి, ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారన్నారు.

నిన్న, ఈ రోజు రాష్ట్రంలో 7 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉందని, మూడేళ్ల క్రితం మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఏపీని మూడేళ్లలోనే విద్యుత్ లోటు రాష్ట్రంగా మార్చారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. వైసీపీ దోపిడీకి అనుకూలంగా సంతకాలు పెట్టిన అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల నెత్తిన వేలకోట్ల విద్యుత్ ఛార్జీల అదనపు భారం మోపిన ప్రభుత్వంపై, అధికారులపై ముమ్మాటికీ క్రిమినల్ కేసులు పెట్టి విచారణ జరపాల్సిందేనన్నారు. ఆర్థికంగా డిస్కంలు దివాలాతీసే పరిస్థితిలో ఉంటే గృహలకు స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ సంస్థలపై అదనపు భారం మోపడం సరైందేనా? అని ప్రశ్నించారు. అనాలోచిత, కక్షసాధింపు నిర్ణయాలు, మీ లబ్ధికోసం తీసుకున్నస్వార్థ నిర్ణయాలే రాష్ట్ర విద్యుత్ రంగానికి శాపాలుగా మారాయన్నారు. విద్యుత్ రంగంలో అనేక అక్రమాలు జరిగాయని కోర్టులకు వెళ్లి భంగపడినవారు, ఈ 4 ఏళ్లలో జరిపిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు సిద్ధమా? అంటూ పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు.

Updated Date - 2023-05-18T16:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising