Raghurama: ఆ మూడు పార్టీలతో ప్రజలకు మంచే జరుగుతుంది..
ABN, First Publish Date - 2023-06-15T15:32:39+05:30
న్యూఢిల్లీ: మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆ వ్యాఖ్యలు తనకు బాధనిపించాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆ వ్యాఖ్యలు తనకు బాధనిపించాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై దుర్బాషలాడటం మంచిది కాదన్నారు. అజయ్ కల్లం (Ajay Kalam) ఇతరులకు ప్రభుత్వం పదవి కాలాన్ని పొడిగించిందని.. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికలకు బీజేపీ (BJP), టీడీపీ (TDP), జనసేన (Janasena) మూడు పార్టీలు కలిసి వెళ్తాయని.. ప్రజలకు మంచే జరుగుతుందని అన్నారు. త్వరలో ఎన్నికలు రావొచ్చునని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.
జగనన్న సురక్షా అని సినిమా టైటిల్ రిలీజ్ చేశారని, జగనన్నకు చెప్పుకుందాం అనే సినిమా ఫెయిల్ అయిందని.. ఇప్పుడు కొత్తగా టైటిల్‌తో వాస్తున్నారని రఘురామ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటామంటే అధికారులు అనుమతి ఇవ్వడం లేదని, ఇది సీఎం జగన్‌కు తెలిసి జరుగుతుందా?.. తెలియక జరుగుతుందా?.. అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు పెద్ద ఎత్తున్న జనం వస్తున్నారని, జగనన్న సురక్ష పథకం నుంచి జనాన్ని రక్షించాలన్నారు. కలెక్టర్ సురక్ష పథకాన్ని పర్యవేక్షించాలని అంటున్నారని, అసలు ఈ పథకం ఏంటని రఘురామ ప్రశ్నించారు.
టీటీడీ దేవాలయం డబ్బును వేరే రాష్ట్రంలో ఖర్చు చేయాలంటే అక్కడ టీటీడీ టెంపుల్‌కు మాత్రమే కేటాయించాలని రఘురామ అన్నారు. కేటీఆర్ అడగ్గానే వైవి సుబ్బారెడ్డి దేవాలయాలకు డబ్బులు ప్రకటించారని, అలా అయితే రాష్ట్రాల సమస్యలు కూడా మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవచ్చు కదా అని అన్నారు. విభజన సమస్యలు కూడా మాట్లాడి పరిష్కరించుకోవాలని రఘురామ సూచించారు.
Updated Date - 2023-06-15T15:32:39+05:30 IST