Raghurama: వైసీపీతో బీజేపీ దూరం అంటున్నారు...వ్యక్తులతో కదా?..
ABN, First Publish Date - 2023-06-13T14:37:16+05:30
న్యూఢిల్లీ: వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ రద్దుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని, డాక్టర్ సునీత తన కేసును తానే వాదించుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: వైఎస్ వివేక హత్య కేసు (YS Viveka Murder Case)లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) మధ్యంతర బెయిల్ రద్దు (Cancellation of Bail)పై మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగిందని, డాక్టర్ సునీత (Dr. Sunitha) తన కేసును తానే వాదించుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju) అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ డాక్టర్.. న్యాయవాదిగా మారారని.. బాగానే వాదించారని అన్నారు. జూన్ 30లోగా వివేక కేసు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఒక వేళ ఏ-8తో కేసును సీబీఐ అపేస్తుందా? లేక ఏ-10 వరకు ఉంటుందా?.. అవినాష్ రెడ్డి ఏమైనా అప్రూవర్ గా మారుతారా? అనే సందేహం వ్యక్తం చేశారు. అవినాష్ పేరు మాత్రం సీబీఐ ఏ-8గా పేర్కొందన్నారు. కాగా ఇది అంతిమంగా కోర్టులలో తేలేది కాదనే అనుమానం వస్తోందని, ప్రజా కోర్టులోనే దీనికి న్యాయం జరుగుతుందని అనిపిస్తుందన్నారు. వైసీపీతో బీజేపీ దూరం అంటున్నారు... వ్యక్తులతో కదా? అని రఘురామ ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వడం మంచి పరిణామమని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వారాహి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్నారని, అమరావతిలో ఐదు అంతస్థుల జనసేనా పార్టీ ఆఫీస్‌కు శంకుస్థాపన చేయడం మంచి పరిణామమన్నారు. అమరావతిలో పార్టీ ఆఫీస్ కడతామని చెప్పడం శుభసూచకమన్నారు. వారాహి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వింటూ ఉండండం మంచిదన్నారు.
ఏపీలో ఎన్నికలు కూడా తెలంగాణతో వస్తాయని పిస్తోందని రఘురామ అన్నారు. ఎన్నికలు తర్వగా వస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థతులే దీనికి కారణమని అన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లు తీసేయాలన్నారు. నారా లోకేష్ యాత్రకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, నెల్లూరులో అడుగు పెట్టిన లోకేష్ పాదయాత్రకు స్వాగతం అంటూ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-06-13T14:37:16+05:30 IST