Vijayawada: సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ..
ABN, First Publish Date - 2023-09-21T11:15:01+05:30
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ చేపట్టిన ఎంబిబిఎస్ కౌన్సిలింగ్‌లో లోపాలు వెలుగు చూశాయని, రిజర్వేషన్ అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి (CPI State Secretary) కె రామకృష్ణ (K Ramakrishna) లేఖ (Letter) రాశారు. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ (YSR Health University) చేపట్టిన ఎంబిబిఎస్ (MBBS) కౌన్సిలింగ్ (Counselling)లో లోపాలు వెలుగు చూశాయని, రిజర్వేషన్ అర్హత కలిగిన ఎస్సీ (ST), ఎస్టీ (SC), బీసీ (BC), మైనార్టీ (Minority) వర్గాల విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఓపెన్ క్యాటగిరి సీట్లను మొదట ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తుంగలో తొక్కిందని విమర్శించారు. తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి ఓపెన్ క్యాటగిరీలో, ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి రిజర్వేషన్ కేటగిరీలో సీట్లు కేటాయించినట్లు ఆరోపణలున్నాయన్నారు. ఇందుకు ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి బాధ్యత వహించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఎంబిబిఎస్ కౌన్సిలింగ్ రద్దు చేసి, తిరిగి కౌన్సిలింగ్ జరిపి, రిజర్వేషన్ విద్యార్థులకు న్యాయం చేయాలని రామకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2023-09-21T11:15:01+05:30 IST