ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: చంద్రబాబుతో రావి వెంకటేశ్వరరావు భేటీ.. ఆ ఇద్దరిలో గుడివాడ టికెట్ ఎవరికి?

ABN, First Publish Date - 2023-02-10T20:52:14+05:30

టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu)తో మాజీ ఎమ్మెల్యే, గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు (Ravi Venkateswara Rao) సమావేశమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu)తో మాజీ ఎమ్మెల్యే, గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు (Ravi Venkateswara Rao) సమావేశమయ్యారు. గుడివాడ నియోజకవర్గం (Gudivada Constituency)లో పరిస్థితులపై చంద్రబాబుకు రావి వెంకటేశ్వరరావు వివరించారు. వెనిగండ్ల రాముతో తనకెలాంటి విభేదాలు లేవని రావి వెంకటేశ్వరరావు చంద్రబాబుకు తెలిపారు. గుడివాడ టికెట్ ఎవరికిచ్చినా పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని రావి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల అరెస్టులు, అక్రమ కేసులను అధినేతకు నివేదించానని రావి చెప్పారు. ఇంకా బాగా కష్టపడాలని చంద్రబాబు సూచించారని రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీకి ఉజ్వల భవిష్యత్‌ ఉందని, అధికారంలోకి రావడం తథ్యమని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ పరిపాలన నచ్చక పల్లపోతు బసవయ్య టీడీపీలో చేరారన్నారు. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయపతాక ఎగురవేయటం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. సమస్యలను ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేదని ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో గుడివాడ నియోజకవర్గం రాజకీయాలే వేరుగా ఉంటాయి. టీడీపీకి మాత్రం ఇక్కడ వరుసగా ఓటమి ఎదురవుతోంది. కొడాలి నాని వరుసగా నాలుగుసార్లు గెలిచి దూకుడు మీద ఉన్నారు. టీడీపీ అభ్యర్థుల్ని మార్చినా సరే ఉపయోగం లేదు. 2014లో రావి వెంకటేశ్వరరావు పోటీ చేయగా.. 2019లో మాత్రం అభ్యర్థిని మార్చి దేవినేని అవినాష్‌కు అవకాశం ఇవ్వగా ఓడిపోయారు. ఇప్పుడు రావి వెంకటేశ్వరరావు (Raavi Venkateswara Rao) ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఆయనే తనకు టికెట్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడే అభ్యర్థి విషయంలో గందరగోళం కొనసాగుతోంది. రావి ఉన్నా సరే రోజుకో పేరు తెరపైకి వస్తోంది.

కొంతకాలంగా గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల రాము స్పీడు (Venigandla Ramu) పెంచారు. నియోజకవర్గంలో ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈయన కూడా ఎన్నారై.. స్వయంగా ఆయనే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్నటి వరకు రాము ఎక్కడా పార్టీ పేరును ప్రస్తావించలేదు. తన సొంతగా ఈ కార్యక్రమాలను ట్రస్ట్ ద్వారా చేస్తున్నట్లు నియోజకవర్గంలో పర్యటించారు. కానీ కొద్దిరోజులుగా రూటు మార్చారు. తన సోషల్ మీడియా అకౌంట్‌లలో కూడా టీడీపీ సీనియర్ నేతగా ప్రొఫైల్ మార్చేశారు.

సంక్రాంతి సమయం నుంచి టీడీపీ నేత హోదాలో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. అంటే అఫిషియల్‌గా టీడీపీలోకి వచ్చినట్లే. గతంలో కూడా నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావుతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఎప్పుడూ తాను టీడీపీలో ఉన్నట్లు ప్రొజెక్ట్ చేసుకోలేదు. కానీ కొద్దిరోజులుగా టీడీపీ నేతగా ఆయనే కార్యక్రమాలను చేస్తున్నారు. అలాగే రావి వెంకటేశ్వరరావును కూడా ఆహ్వానిస్తున్నారు. ఇద్దరూ కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వెనిగండ్ల రాముకు విదేశాలతో పాటు కృష్ణాజిల్లాలో వ్యాపారాలు ఉన్నాయట. అంతేకాదు స్థానికంగా కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ఇది టీడీపీకి ప్లస్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు. సామాజిక సమీకరణలతో పాటూ బలమైన నేతగా ఉన్నారు. అందుకే వెనిగండ్ల రాము పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇప్పుడు టీడీపీ నేతగా అఫిషయల్‌గా మారిపోయారు. కొంతమంది కోవర్టులు పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కొత్త అభ్యర్థి నియోజకవర్గానికి వస్తారని ప్రతిసారీ చెబుతున్నారని.. పార్టీకి నష్టం చేసే ఎవరైనా సరే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Updated Date - 2023-02-10T21:00:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising