Sajjala: ఈడీ కూడా స్కిల్ కేసులో నలుగురిని ఆరెస్టు చేసింది
ABN, First Publish Date - 2023-10-11T16:58:50+05:30
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరెస్టు అయి నెల రోజులు దాటిందని, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో స్కాం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కోర్టు రిమాండ్‌కు పంపించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) ఆరెస్టు అయి నెల రోజులు దాటిందని, స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో స్కాం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కోర్టు రిమాండ్‌కు పంపించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajja Ramakrishna Reddy) అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ. 300 కోట్లకుపైగా దోచుకున్నారని అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని, ఈ కేసులో ఈడీ కూడా నలుగురిని అరెస్టు చేసిందన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని సీఐడీ అధికారులు విచారణ చేసి అరెస్టు చేశారని, కేసు విచారణ జరగకుండా క్వాష్ పిటిషన్ (Quash Petition) వేసి కేసు కొట్టేయించాలని చూస్తున్నారన్నారు. స్కిల్ స్కాంలో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని, దీనిపై మాట్లాడకుండా 17ఏపై మాట్లాడుతున్నారని, స్కిల్ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారని ఆయన సంతకాలు ఉన్నాయని, కోర్టు విచారణలో చంద్రబాబు తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చునని అన్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇన్నర్ రింగ్ రోడ్ (Inner Ring Road) లేని దానికి కుట్ర ఏముందని నారా లోకేష్ (Nara Lokesh) అంటున్నారని, అక్కడే హెరిటేజ్ భూములు ఎందుకు కొన్నారని సజ్జల ప్రశ్నించారు. లింగమనేని గెస్ట్ హౌస్‌లో ఎందుకు వున్నారని నిలదీశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబుని అరెస్టు చేస్తే తమకు ఏమి వస్తుందన్నారు. బాబు ఇంకా నాలుగు సభలు పెడితే వైసీపీకి నాలుగు ఓట్లు వస్తాయన్నారు. లోకేష్ ఢిల్లీలో కూర్చునే బదులు ప్రజల్లో తిరగవచ్చు కదా అని సజ్జల అన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై సజ్జల కామెంట్స్..
పురంధేశ్వరి (Purandeshwari) పేరుకు బీజేపీ అయినా టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ ఫామిలీ అంతా చంద్రబాబుకు అండగా వున్నారని, కాంగ్రెస్‌లో ఉన్నా, బీజేపీలో ఉన్నా పురంధరేశ్వరి చంద్రబాబు కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. పురంధేశ్వరి టీడీపీకి అవసరం అయినప్పుడు అవసరమైన మాటలు మాట్లాడుతున్నారని, మద్యంపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరడం విచిత్రంగా ఉందని సజ్జల వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-10-11T16:58:50+05:30 IST