ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: విజయవాడలో ఇసుక కాంట్రాక్టర్ల ఆందోళన

ABN, First Publish Date - 2023-04-18T12:37:41+05:30

విజయవాడ: పెండింగ్ బిల్లులు (Pending Bills) చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విజయవాడలో ఇసుక కాంట్రాక్టర్లు (Sand Contractors) ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పెండింగ్ బిల్లులు (Pending Bills) చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విజయవాడలో ఇసుక కాంట్రాక్టర్లు (Sand Contractors) ఆందోళనకు దిగారు. తాడిగడపలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా (Protest) చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత రెండేళ్లుగా తమకు బిల్లులు ఇవ్వడంలేదని ఇసుక కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి నెల 25లోపు బిల్లులు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని.. అయితే బిల్లులు ఇవ్వకుండా తిప్పుతున్నారని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెండింగ్ బిల్లులు అడుగుతుంటే తమను కార్యాలయంలోకి కూడా రానివ్వడంలేదని కాంట్రాక్టర్లు వాపోయారు. అప్పులు చేసి ఇసుక రవాణా చేస్తే ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఆర్థిక బాధలతో మానసికంగా కుంగిపోతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు బిల్లులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే తమకు ఆత్మహత్యేలే శరణ్యమని కాంట్రాక్టర్లు కంటతడిపెట్టారు.

Updated Date - 2023-04-18T12:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising