ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP : వైసీపీలో చెలరేగిన ఇసుక దుమారం

ABN, First Publish Date - 2023-09-06T08:02:13+05:30

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వైసీపీలో ఇసుక దుమారం చెలరేగింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పొలీసు స్టేషన్‌కు వైసీపీ నాయకులు తరలించారు. ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడిలో ప్రభుత్వం నియమించిన జేపీ సంస్థ ఇసుక వ్యాపారం చేస్తోంది.

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వైసీపీలో ఇసుక దుమారం చెలరేగింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పొలీసు స్టేషన్‌కు వైసీపీ నాయకులు తరలించారు. ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడిలో ప్రభుత్వం నియమించిన జేపీ సంస్థ ఇసుక వ్యాపారం చేస్తోంది. నూజివీడు స్టాక్ పాయింట్‌కి తరలిస్తున్నట్లు చెప్పి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్న జేపీ సంస్థ లారీలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. 20 టన్నుల లారీలకు 40 టన్నులు ఇసుకను పోసి అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నారని వైసీపీ నాయకులు వాపోయారు. కోటికలపూడి నుంచి ఇసుక లారీలు వస్తున్న విషయం అధికార పార్టీ నాయకులు తెలుసుకున్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద లారీలను సొంత పార్టీ నాయకులే అడ్డుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే 5 లారీలను ఇబ్రహీంపట్నం పోలీసులు సీజ్ చేశారు.

Updated Date - 2023-09-06T08:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising