Skill Case: చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో నేడు విచారణ
ABN, First Publish Date - 2023-11-10T08:51:28+05:30
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటీషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బెయిల్ పిటీషన్ (Bail Petition)పై శుక్రవారం హైకోర్టు (High Court)లో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. ఇదే కేసులో చంద్రబాబుకు బెయిల్ దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. కాగా అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు.. హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఇటీవల సిమెన్స్ సీనియర్ డైరెక్టర్ భాస్కర్‌కు (Siemens Senior Director Bhaskar) గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) పూర్తిస్థాయి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
కాగా స్కిల్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ వేశారు. దీనిపై వాదనలు జరిగాయి. అయితే తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వ్‌లో ఉంచింది. దీపావళి సెలవులు తరువాత తీర్పు ఇస్తామని వెల్లడించింది. కాగా ఫైబర్ నెట్ కేసులో ఏడుగురు నిందితుల ఆస్తుల జప్తుపై శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
Updated Date - 2023-11-10T09:50:33+05:30 IST