ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Assembly.. సభా స్ధానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు చించి వేసారు: స్పీకర్

ABN, First Publish Date - 2023-09-21T11:53:53+05:30

అమరావతి: శాసనసభలో ప్రతిపక్ష నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే సభా స్ధానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారని, ఈ స్ధానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు చించి వేసారని అన్నారు.

అమరావతి: శాసనసభలో ప్రతిపక్ష నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే సభా స్ధానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు (TDP Leaders) చుట్టుముట్టారని, ఈ స్ధానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు చించి వేసారని అన్నారు. ప్రజాస్వామ్యన్ని అగౌరవ పరిచేలా మీసాలు మెలివేయడం, తొడలు చరచడం లాంటి వికృత చేష్టలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Balakrishna) ఇలాంటి చర్యలు చేయడంపై ఆయనకు.. సభకు హెచ్చరిక చేస్తున్నామన్నారు. బాలకృష్ణకు ఇది మొదటితప్పుగా భావించి ఆయనకు మొదటి హెచ్చరిక జారీ చేస్తున్నామని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.

365 నియమం ప్రకారం సభ ఆస్తులకు సభ్యులు ఉద్దేశ పూర్వకంగా నష్టం చేసినప్పడు ఆమొత్తాన్ని సభ్యుల నుండి రాబట్టడం జరుగుతుందని సభాపతి అన్నారు. అలాగే వైసీపీ సభ్యులు కూడా తమ స్ధానాల్లో కుర్చోవాలని పదే పదే స్పీకర్ చెప్పారు. తాను అనౌన్స్‌మెంట్ చేస్తున్నప్పుడు మీ సీట్లలోకి వెళ్లాలని వైసీపీ సభ్యులను కోరారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్య ప్రసాద్ ఫైళ్లను చించి వేయడంతో పాటు, మానిటర్‌ను పగలగొట్టారని, సభ స్ధానాన్ని అగౌరవ పరచిన సభ్యులు అనగాని, శ్రీధర్ రెడ్డిలను ఈ సెషన్ ఆఖరు వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

Updated Date - 2023-09-21T13:38:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising