Pranav Gopal: అందుకే విదేశీ విద్యను రద్దు చేశారు: ప్రణవ్ గోపాల్
ABN, First Publish Date - 2023-06-12T17:06:25+05:30
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) విద్యారంగాన్ని (Education) సర్వనాశనం చేశారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (Pranav Gopal) విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ము సీఎంకు ఉందా?.. ఉంటే చర్చకు రావాలన్నారు. ‘నాడు-నేడు’ పనుల్లో కమీషన్లకు కక్కుర్తిపడి పేదపిల్లలకు విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. సీఎం పిల్లలు తప్ప, పేదవాళ్లు విదేశాలకు వెళ్లకూడదనేది జగన్ ఉద్దేశమని, అందుకే విదేశీవిద్యను రద్దు చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడేనని (Chandrababu Naidu) ప్రణవ్ గోపాల్ అన్నారు. జగన్‌కు, తన ప్యాలెస్ పెంపుడు కుక్కలకు చంద్రబాబు పేరు తలచే అర్హత లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. పసిపిల్లలకు కానుకలు ఇచ్చే అంశాన్ని కూడా రాజకీయం చేయడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిలువుటద్దమన్నారు. సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే సందర్భం కాని చోట రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన రూ.5 లక్షల కోట్లు వైసీపీ దొంగల ముఠా తమ జేబుల్లో దాచుకున్నారని కేంద్రమంత్రి అమిత్ షా బహిరంగంగా చెప్పారన్నారు. రాష్ట్ర ద్రోహి జగన్ అయితే.. రాష్ట్ర సంక్షేమ రథ సారధి చంద్రబాబు అని ప్రణవ్ గోపాల్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-06-12T17:06:25+05:30 IST