ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SupremeCourt: మాజీ మంత్రి నారాయణ కేసులో సుప్రీం కీలక ఆదేశం

ABN, First Publish Date - 2023-02-27T14:48:22+05:30

ఏపీ మాజీ మంత్రి నారాయణ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏపీ మాజీ మంత్రి నారాయణ (AP Former Minister Narayana) కేసులో సుప్రీం కోర్టు (Supreme court) కీలక ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు (Leakage of class 10 question papers Case)లో నారాయణ (Narayana) దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం విచారించింది. ఈ కేసుకు సంబంధించి సెషన్స్ కోర్టు (Sessions Court)లో విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సుప్రీం స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నామని... అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ముగించింది.

కాగా.. గతేడాది చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన నారాయణకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేయగా... దాన్ని సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు నారాయణకు బెయిల్ రద్దు చేస్తూ రిమాండ్‌‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై నారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం నారాయణ బెయిల్‌పై బయట ఉన్నారు.

నారాయణ నివాసాల్లో ఏపీ సీఐడీ సోదాలు....

మరోవైపు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముందగా నారాయణ కుమార్తె ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు.. ఒక్కరోజు వ్యవధిలో మాజీ మంత్రి ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాలపై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుటుంబీకుల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించారు. అలాగే పలు లావాదేవీల గురించి ఆరా తీసినట్లు సమాచారం.

అలాగే ముందుగా నారాయణ కుమార్తె నివాసంలోనూ ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లిలోని ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. సీఐడీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు నారాయణపై సీఐడీ అధికారులు పలు కేసులు పెట్టారు. నారాయణపై పదోతరగతి పరీక్షాపత్రం లీకేజీ (10th class exam paper leakage)తో పాటు, అమరావతి రాజధాని భూముల (Capital lands of Amaravati)కు సంబంధించి కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో భాగంగా సీఐడీ అధికారులు (CID Officers) పలుమార్లు నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తాజాగా నారాయణ ఇళ్లలో సోదాలు ముగిసిన అనంతరం ఆయన కుమార్తెలను ఏపీ సీఐడీ అధికారులు టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-02-27T14:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising