ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda Uma: ‘వాటితోనే జగన్ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తారా?’

ABN, First Publish Date - 2023-03-11T14:09:27+05:30

అధికారపిచ్చితో జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: అధికారపిచ్చితో జగన్ (AP CM Jagan Mohan reddy) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు (TDP Politburo Member Bonda Umamaheswara Rao) మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి ఉపఎన్నికలో దొంగఓట్లతో గెలిచిన జగన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నకిలీ పట్టభద్రుల్ని నమ్ముకున్నారన్నారు. బోగస్ ఓట్లు, నకిలీ ఓటర్లు, డబ్బు, మద్యంతోనే జగన్ వచ్చేఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తారా? అని ప్రశ్నించారు. దొంగఓట్ల నమోదులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు భాగస్వాములైనా రాష్ట్రఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీశారు. దొంగఓట్ల తంతులో భాగస్వాములైన అధికారులు, తాయిలాలకు ఆశపడి ఓటర్లుగా నమోదైనవారి వివరాలన్నీ తమవద్ద ఉన్నాయన్నారు. జగన్ కాపాడతాడనో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమనకరుణాకర్ రెడ్డి రక్షిస్తారనో దొంగఓట్లు వేయడానికి నకిలీ పట్టభద్రులు వస్తే, వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అధికారపార్టీ అండతో రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న దొంగఓట్ల క్రతువుపై కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-03-11T14:09:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising