ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna Dist.: టీడీపీ నేత కొల్లు రవీంధ్ర హౌస్ అరెస్టు..

ABN, First Publish Date - 2023-06-01T15:11:43+05:30

కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం ఇంగ్లీష్‌పాలెంలో టీడీపీ కార్యకర్తలపై కొందరు దాడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra)ను పోలీసులు హౌస్ అరెస్టు (Hourse Arrest) చేశారు. మూడు రోజుల క్రితం ఇంగ్లీష్‌పాలెంలో టీడీపీ కార్యకర్తలపై కొందరు దాడి చేశారు. నిందితులను అరెస్టు చేయాలని చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట కొల్లు రవీంధ్ర ఆందోళనకు సిద్ధమయ్యారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. మరోవైపు టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ (YCP) కార్యకర్తలను తక్షణమే అరెస్టు చేయాలని కొల్లు రవీంధ్ర డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కొల్లు రవీంధ్ర మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో రేపటి నుంచి (శుక్రవారం) ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. గత మూడు రోజుల క్రితం మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంలో టీడీపీ మైనార్టీ కార్యకర్తలపై వైసీపీ రౌడీమూకలు దాడి చేశాయన్నారు. దాడిలో గాయపడ్డ మైనార్టీ కార్యకర్తలు సయ్యద్ బాజీ, చోటా బాబు చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ద్వజమెత్తారు. ఎమ్మెల్యే పేర్నినాని నిందితులను కాపాడుతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

Updated Date - 2023-06-01T15:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising