Konakalla Narayana Rao: వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలను చూస్తున్నాం..
ABN, First Publish Date - 2023-02-22T16:44:54+05:30
కృష్ణాజిల్లా: గన్నవరంలో ఘటనలు అధికార పార్టీ నేతల అహంకారాన్ని తెలియజేస్తున్నాయని టీడీపీ నేత (TDP Leader), మాజీ ఎంపి కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayana Rao) అన్నారు.
కృష్ణా జిల్లా: గన్నవరంలో ఘటనలు అధికార పార్టీ నేతల అహంకారాన్ని తెలియజేస్తున్నాయని టీడీపీ నేత (TDP Leader), మాజీ ఎంపి కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayana Rao) అన్నారు. బుధవారం ఆయన గన్నవరం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. వైసీపీ శ్రేణుల (YCP Activists) దాడిలో ధ్వంసమైన ఆఫీస్, కార్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, ఇలా ప్రత్యర్ధి పార్టీ కార్యాలయాలపై దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు. ఇటువంటి దారుణాలను ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)లో చూస్తున్నామన్నారు.
తీవ్ర విమర్శలు చేసినందుకే ఈ చర్యలు అని చెబుతున్నారని, ఇదే నిజమైతే ముందు కొడాలి నాని (Kodali Nani), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొనకళ్ల నారాయణరావు
ప్రశ్నించారు. వాళ్లిద్దరూ దూషణలు చేసినట్లుగా టీడీపీ నేతలు (TDP Leaders) ఎవరైనా చేశారా? అని అన్నారు. పోలీసుల సాక్షిగా దాడి చేస్తే వారిపై కేసులు లేవని, సుమోటోగా తీసుకుని ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ కళ్లల్లో ఆనందం కోసం పోలీసు వ్యవస్థను దిగజార్చుతున్నారని, ఖాకీలకు ఉన్న గౌరవాన్ని ప్రజల్లో చులకన చేయొద్దన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ పోలీసులవైపే చూస్తారన్నారు. అలాంటి పోలీసులే దాసోహం అయితే... తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. బాధితులనే నిందితులుగా చేస్తుంటే పోలీసులను ఇక ఎవరూ పట్టించుకోరన్నారు. నిష్పక్షపాతంగా, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని సూచించారు. చట్టం చుట్టంగా మారితే... న్యాయస్థానంలో ప్రైవేటు కేసులు వేసి న్యాయ పోరాటం చేస్తామని కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేశారు.
Updated Date - 2023-02-22T16:44:57+05:30 IST