ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KS Jawahar: ‘కోడికత్తి బాధితుడికి ఎప్పుడు విముక్తి జగన్?’

ABN, First Publish Date - 2023-04-11T13:00:38+05:30

కోడికత్తి కేసు బాధితుడైన దళితబిడ్డ శ్రీనివాస్‌కు జగన్ ఎప్పుడు విముక్తి కల్పిస్తారని మాజీమంత్రి కే.ఎస్.జవహర్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: కోడికత్తి కేసు (Kodikathi Case) బాధితుడైన దళితబిడ్డ శ్రీనివాస్‌కు జగన్ (AP CM YS Jaganmohan Reddy) ఎప్పుడు విముక్తి కల్పిస్తారని మాజీమంత్రి కే.ఎస్.జవహర్ (TDP Leader KS Jawahar) ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... అంబేద్కర్ మహానీయుడు చెప్పినట్టు జగన్ (AP CM) పులుల్ని వదిలేసి మేకల్ని బలి తీసుకుంటున్నారని విమర్శించారు. తాను కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుంటూ విచారణలో జాప్యానికి జగనే కారణమవుతున్నారని అన్నారు. కోడికత్తి ఘటనలో కుట్రకోణంపై విచారణ జరపాలంటూ జగన్ (YCP Chief)ఇప్పుడు చిలుకపలుకులు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు.

నాలుగేళ్ల నుంచి సెంట్రల్ జైల్లో శ్రీనివాస్ మగ్గిపోతున్నా, అతని తల్లిదండ్రులు కన్నీటితో విలపిస్తున్నా జగన్‌లో చలనంలేదన్నారు. శ్రీనివాస్ తల్లిదండ్రుల ముఖం చూసి, వారికి ధైర్యం చెప్పడానికి కూడా వైసీపీ అధినేతకు మనసురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బిడ్డల్ని తనస్వార్థ రాజకీయాలకు బలిచేస్తున్న జగన్ వారికి మేనమామ అవుతాడా? అని ప్రశ్నించారు. గతఎన్నికల్లో లబ్ధిపొండానికి కోడికత్తి డ్రామా, బాబాయ్‌పై గొడ్డలివేటు నాటకాలు ఆడిన జగన్ ఈ ఎన్నికల్లో లబ్ధికోసం ఎలాంటి కొత్తనాటకాలు ఆడుతున్నాడో చెప్పాలన్నారు. కోడికత్తి శ్రీనివాస్ కుటుంబాన్ని జగన్ వెంటనే ఆదుకోకుంటే దళితుల ఆగ్రహానికి బలికాక తప్పదని జవహర్ హెచ్చరించారు.

Updated Date - 2023-04-11T13:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising