TDP Leader: కుటుంబసమేతంగా ఎన్‌హెచ్‌ఆర్సీని కలిసిన టీడీపీ నేత పట్టాభి
ABN, First Publish Date - 2023-03-15T15:20:19+05:30
జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి బుధవారం కుటుంబ సమేతంగా కలిశారు.
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ (National Human Rights Commission)ను టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి (TDP Leader Kommareddy Pattabhi) బుధవారం కుటుంబ సమేతంగా కలిశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు రాజీవ్ జైన్ (Rajiv Jain is a member of the National Human Rights Commission)ను కలిసి గన్నవరం ఘటన (Gannavarma Issue)పై ఫిర్యాదు చేశారు. గన్నవరంలో జరిగిన అప్రాజస్వామిక దాడి, వాహనాల తగలబెట్టడం ధ్వంసం, పార్టీకి చెందిన అనేకమంది నాయకులను చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడంపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కార్యకర్తలను కొట్టారని... తనను ఫిజికల్ టార్చర్ చేశారని తెలిపారు. జరిగిన సంఘటనలపై జిల్లా ఎస్పీ జాషువా, ఆయన కింద పని చేసిన అధికారులు తమపై దాడి చేస్తుంటే ఎక్కడ కూడా అదుపు చేయకుండా తిరిగా టీడీపీ నేతలనే అరెస్ట్ చేశారన్నారు. తోట్లవల్లూరు స్టేషన్‌లో ముగ్గురు చేత 30 నిమిషాల పాటు భౌతికంగా హింసించారన్నారు. ‘‘నన్ను అరెస్టు చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా చేశారు. కుటుంబ సభ్యులను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు’’ అని తెలిపారు.
జరిగిన అన్ని సంఘటనలను కమిషన్ సభ్యుడు రాజీవ్ కి వివరించడం జరిగిందని పట్టాభి అన్నారు. టీడీపీ నాయకుల (TDP Leaders)ను అరెస్ట్ చేసి భౌతికంగా ఏ విధంగా ఇబ్బందుల గురి చేశారనే అంశాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో దిగజారిపోయిన పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారని.. కమిషన్ సభ్యులు తమకు భరోసా కల్పించారని అన్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ తరపున ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇటువంటి దాడులకు అరెస్టులకు భయపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఉన్న అన్ని హక్కులను ఉపయోగించుకుంటామన్నారు. ఏ స్థాయిలో ఉన్న అధికారులను ఎవర్నీ కూడా విడిచి పెట్టే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తాను ఏ రోజు భయపడి వెనక్కి పోయే వ్యక్తిని కాదని.. పోరాటం చేస్తానని తెలిపారు. రాష్ట్ర డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ లేఖ రాస్తామని చెప్పారన్నారు. అధికారులు ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదని వారిపై చర్యలు తప్పవని అన్నారు. వైసీపీ సెక్షనలు అమలు చేయొద్దరి.. ఐపీసీ సెక్షన్ అమలు చేయాలన్నారు. మోచేతి నీళ్లు తాగుతూ అమ్ముడు పోయిన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని పట్టాభి స్పష్టం చేశారు.
Updated Date - 2023-03-15T15:20:26+05:30 IST