ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varla Ramaiah: లోకేష్ పాదయాత్రకు రక్షణ ఏర్పాట్లు చేయండి.. డీజీపీకి వర్ల లేఖ

ABN, First Publish Date - 2023-04-10T15:44:55+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర సజావుగా సాగేటట్లు రక్షణ ఏర్పాట్లు చేయాలంటూ డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) సజావుగా సాగేటట్లు రక్షణ ఏర్పాట్లు చేయాలంటూ డీజీపీ (AP DGP)కి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) లేఖ రాశారు. 66 రోజులుగా వేలాది మంది అభిమానులతో సాగుతున్న లోకేష్ పాదయాత్రను విచ్ఛిన్నం చేయాలని కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలో ఉవ్వెత్తున సాగుతున్న పాదయాత్ర చూసి కొంతమంది వైసీపీ పెద్దలకు కన్ను కుట్టిందన్నారు. తన సామ్రాజ్యంలో అడుగుపెడితే పాదయాత్రను భగ్నం చేస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (MLA Ketireddy Peddareddy) బీరాలు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు.

అరాచకం, దౌర్జన్యాలకు పేరుగాంచిన పెద్దిరెడ్డి పాదయాత్రను భగ్నం చేస్తానని చెప్పడం సరికాదన్నారు. డీజీపీ వెంటనే తాడిపత్రి ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకొని లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు లేకుండా తగిన రక్షణ చర్యలు చేయాలని కోరారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఎట్టిపరిస్ధితుల్లోనూ యువనేత పాదయాత్రను తాడిపత్రిలో జరగనివ్వనని ఎమ్మెల్యేకు హామీ ఇవ్వటం పోలీస్ అధికారిగా దుర్మార్గపు చర్య – తగని పని అని అన్నారు. పాదయాత్రకు ఏ ఆటంకం జరిగినా ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు శాఖ పూర్తి బాధ్యత వహించాలని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-04-10T15:44:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising