ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: తిరువూరులో టీడీపీ ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’... అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2023-01-05T09:54:21+05:30

తిరువూరులో పట్టణంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో పట్టణంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించింది. భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఇదేం కర్మ కార్యక్రమంలో టీఎన్టీయుసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామ రాజు, తిరువూరు టీడీపీ ఇంచార్జి శావల దేవా దత్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్, నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు వేరే వాటికి దారి మళ్ళించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో పనులు లేక కార్మికులు రోడ్డున పడ్డారు. కార్మికులకు రోజు పని లేక పూట గడవని పరిస్థితులు నెలకొన్నాయని తాపీ కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు.

కాగా.. కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఇదేం కర్మ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తిరువూరు టీడీపీ ఇన్చార్జ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇదేమి ఖర్మ కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ... ఇంటి నుంచి బయటకు రావద్దంటూ దేవదత్‌ను పోలీసులు బలవంతంగా ఇంటికి పంపించివేశారు.

Updated Date - 2023-01-05T09:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising