ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayawada: ఏసీబీ కోర్టు వద్ద ఉద్రిక్తత..

ABN, First Publish Date - 2023-09-10T13:56:06+05:30

విజయవాడ: ఏసీబీ కోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడకు వచ్చిన టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు వచ్చిన వారిని వచ్చినట్టుగానే పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్తున్నారు. రోడ్లపై తరిమి తరిమి మరీ అరెస్ట్ చేస్తున్నారు. సివిల్ కోర్టుకు కి.మీ. దూరంలో ఉన్న వారిని సయితం బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు.

విజయవాడ: ఏసీబీ కోర్టు (ACB Court) వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడకు వచ్చిన టీడీపీ నేతలు (TDP Leaders), అభిమానులు, కార్యకర్తలు వచ్చిన వారిని వచ్చినట్టుగానే పోలీసులు అరెస్టు (Arrest) చేసి తీసుకువెళ్తున్నారు. రోడ్లపై తరిమి తరిమి మరీ అరెస్ట్ చేస్తున్నారు. సివిల్ కోర్టుకు కి.మీ. దూరంలో ఉన్న వారిని సయితం బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మం చౌదరి, ఎమ్మెస్ రాజుతో పాటు పలువురని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. చంద్రబాబు (Chandrababu)కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తమను అరెస్ట్ చేయడంపై మండిపడుతున్నారు.

కాగా అంతకుముందు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది (Supreme Court Advocate) సిద్ధార్థ లూథ్రా (Siddhartha Luthra) బృందం వాదనలు వినిపించారు. సీఐడీ (CID) తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ (Skill Scam) రాజకీయ ప్రేరేపితమని, చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సిద్ధార్థ లూథ్రా అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామని అదనపు ఏజీ సమాధానం ఇచ్చారు. 2021లో కేసు పెడితే ఇప్పటివరకూ ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేయలేదని కోర్టు ప్రశ్నించింది.

409 సెక్షన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సీఐడీ వ్యవహరించిందని సిద్ధార్థ లూథ్రా అన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ అధికారుల ఫోన్‌ సంభాషణలను కోర్టుకు సమర్పించాలని ఆయన అన్నారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసును ఈ సందర్భంగా లూథ్రా ప్రస్తావించారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలని, గవర్నర్ అనుమతిని సీఐడీ ఎందుకు తీసుకోలేదని సిద్ధార్థ్‌ లూథ్రా ప్రశ్నించారు. కాగా భోజన విరామ సమమం కావడంతో న్యాయమూర్తి 30 నిముషాలు విరామం ప్రకటించారు. తిరిగి 1:30 గంటలకు వాదనలు ప్రారంభంకానున్నాయి.

Updated Date - 2023-09-10T13:56:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising