YCP: అవినాశ్ బెయిల్ పిటిషన్ విచారణలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై వైసీపీ పెద్దల్లో కలవరం
ABN, First Publish Date - 2023-04-21T14:53:08+05:30
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్‌పై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంపై తాడేపల్లి ప్యాలెస్‌లో కలవరం మొదలైంది.
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) స్టే ఇవ్వడంపై తాడేపల్లి ప్యాలెస్‌లో కలవరం మొదలైంది. అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్‌పై వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి సుప్రీంలో పిటిషన్ వేయగా.. విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ముఖ్య నేతలు ఆరా తీస్తున్నారు. అవినాశ్ మధ్యంతర బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇటువంటి ఉత్తర్వులు చూశారా అని అవినాశ్ లాయర్‌ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో సునీత పిటీషన్‌పై స్టే ఇవ్వడంతో సోమవారం జరిగే విచారణపై వైసీపీ కీలక నేతలు దృష్టి సారించారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీనియర్ లాయర్‌లతో మంతనాల్లో ప్యాలెస్ పెద్దలు మునిగిపోయారు. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ను వైసీపీ అగ్ర నేతలు ఆన్‌లైన్‌లో పరిశీలించారు. సుప్రీంకోర్టు స్టే, చేసిన వ్యాఖ్యలపై అగ్ర నేతలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం విచారణ సందర్బంగా క్రిమినల్ పిటీషన్‌ల విచారణలో పేరొందిన లాయర్ల కోసం వైసీపీ పెద్దలు అన్వేషణ మొదలుపెట్టినట్లు సమాచారం.
కాగా... వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్ట్ స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సోమవారం అన్ని విషయాలు పరిశీలిస్తామని కోర్ట్ వెల్లడించింది. హైకోర్ట్ తీర్పు చాలా దారుణమని, ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది.
Updated Date - 2023-04-21T14:58:54+05:30 IST