AP Farmers: ఆఫ్‌లైన్‌లో ధాన్యం విక్రయం.. అధికారుల మీనమేషాలు.. అగమ్యగోచరంలో రైతులు
ABN, First Publish Date - 2023-03-27T11:46:27+05:30
ఆఫ్‌లైన్‌లో ధాన్యం విక్రయించిన రైతలు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
కృష్ణా: ఆఫ్‌లైన్‌లో ధాన్యం విక్రయించిన రైతుల (Farmers) పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆఫ్‌లైన్‌లో ధాన్యం విక్రయించి నెలలు గడుస్తున్నప్పటికీ అధికారులు ఆన్‌లైన్ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. కొద్దిరోజుల్లో ధాన్యం కొనుగోలు నిలిపివేస్తారన్న ప్రకటనతో రైతుల్లో కలవరం నెలకొంది. ఘంటసాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు... మచిలీపట్నంలోని ఉన్నతాధికారులను కలిసి తమ గోడు వెళ్లబొసుకున్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి 20 శాతం ధ్యాన్యం కోనుగోలు జరిగింది. అధికారుల సూచనతో 50 శాతం ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో రైతులు విక్రయించారు. అయితే ఆఫ్‌లైన్‌లో విక్రయించిన ధాన్యాన్ని ఆన్‌లైన్ చూసేందుకు అధికారుల మీనమేషాలు లెక్కబెడుతున్న పరిస్థితి. ప్రస్తుతం కోనుగోలు చేస్తున్న ధాన్యాన్ని మాత్రమే రైతు భరోసా కేంద్రం అధికారులు ఆన్‌లైన్ చేస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో ధాన్యం విక్రయించి నాలుగు నెలలు గడుస్తోందని... తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ ధాన్యాన్ని కూడా ఆన్‌లైన్ చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. స్పందనలో ఫిర్యాదు చేస్తే నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు చెప్పారని.. అయితే నాలుగు రోజులు కాదు 40 రోజులైనా సమస్య పరిష్కరం కాలేదన్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం కోనుగోలును మార్చి 31 తర్వాత నిలిపివేస్తామన్న ప్రకటన రైతులను కలవరానికి గురిచేస్తోంది. వాతవరణ పరిస్థితుల ప్రభావంతో ఇంకా చాలా వరకు కుప్పలు నూర్చని వైనంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-03-27T12:21:44+05:30 IST