Vijayawada: దుర్గమ్మకు టీటీడీ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు
ABN, First Publish Date - 2023-10-16T15:39:55+05:30
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు.
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరఫున బెజవాడ ఇంద్రకీలాద్రి (Indrakiladri) అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ (Durgamma)కు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సభ్యులు మేక శేషుబాబు (Meka Seshubabu), గాదిరాజు వెంకట సుబ్బరాజు (Gadi Raju Venkata Subbaraju) మీడియాతో మాట్లాడుతూ టీటీడీ దేవస్థానం తరపున కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అమ్మ కరుణా కటాక్షాలు, శ్రీవెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై చక్కటి ఏర్పాట్లు చేశారని, సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) చేస్తున్న మంచి అందరికీ చేరువకావాలని, ఆయన నిర్ణయాలు ఫలించాలని అమ్మను ప్రార్ధించామని మేక శేషుబాబు, గాదిరాజు వెంకట సుబ్బరాజు అన్నారు.
దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్, కర్నాటి రాంబాబు (Karnati Rambabu) మాట్లాడుతూ.. టీటీడీ తరపున ఏటా పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వెంకటేశ్వరస్వామి సోదరి కనకదుర్గమ్మఅని అన్నారు. టీటీడీ అనుమతిస్తే తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఇంద్రకీలాద్రి నుంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని ఆయన అన్నారు.
Updated Date - 2023-10-16T15:39:55+05:30 IST