ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Central govt: ఏపీ సీఐడీ మాజీ డీజీపై చర్యలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు

ABN, First Publish Date - 2023-02-14T09:44:23+05:30

సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ లేఖ రాసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌ (CID DG PV Sunil Kumar)పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary to Govt)కి కేంద్ర హోం శాఖ (Central Home Department) లేఖ రాసింది. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు (CID Officers) అక్రమ అరెస్టులు, కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడుతున్నారని గతేడాది కేంద్ర హోంశాఖకు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ (High Court Advocate Gudapati Lakshminarayana) లేఖ రాశారు. సీఐడీ విభాగంలో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలపై అక్రమ కేసులు మోపుతున్నారని, అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే ఈ విధంగా చేస్తున్నారని హోంశాఖకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబర్‌లో రాసిన లేఖపై కేంద్రహోంశాఖ కార్యదర్శి స్పందించారు. ఈరోజు పోస్టులో లక్ష్మీనారాయణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారులు లేఖ పంపారు. కేంద్ర హోంశాఖ పంపిన లేఖలో ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2023-02-14T10:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising