ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vasireddy Padma: బాలిక హత్య బాధాకరం...

ABN, First Publish Date - 2023-02-13T16:48:02+05:30

విజయవాడ: తాడేపల్లి (Tadepalli)లో బాలిక హత్య బాధాకరమని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తాడేపల్లి (Tadepalli)లో బాలిక హత్య బాధాకరమని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) అన్నారు. ఆస్పత్రి వద్ద బాధితురాలి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తప్పు చేశావన్నందుకు గొడ్డలితో నరికేశాడని, తప్పుడు ఉద్దేశం లేదంటూనే హత్య చేశాడని, అటువంటి వారికి కఠిన శిక్ష పడాలని అన్నారు. ఈ ఘటనపై పోలీసులతో కూడా మాట్లాడుతున్నామని అన్నారు.

విజయవాడలో టీడీపీ (TDP) నేత కూడా ఒక కుటుంబంపై దాడి‌ చేశాడని, ఈ‌ విషయం మాట్లాడుతుండగానే ఈ హత్య జరిగినట్లు తెలిసిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. లైంగిక వేధింపులు అడ్డుకుంటే హత్య చేస్తారా?.. ఇటువంటి ఘటనల సమయంలో కూడా టీడీపీ రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. బాధిత కుటుంబాన్ని బెదర కొట్టేలా చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమో అందరూ ఆలోచన చేయాలని వాసిరెడ్డి పద్మ అన్నారు.

పూర్తి వివరాలు..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి (CM House) కూత వేటు దూరంలో ఈ అమానుష ఘటన జరిగింది. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని రాజు అనే యువకుడు గంజాయి మత్తు (Marijuana intoxication)లో అతి కిరాతకంగా నరికి చంపాడు. రాణి ఇంట్లోనే ఉంటుండగా తల్లి మనోహరం కూలిపనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న రాజు... యువతిపై కన్నేశాడు. అప్పుడప్పుడూ యువతి ఇంటికి వచ్చి మాట్లాడుతుండటంతో స్థానికులు ఎవరూ పట్టించుకోలేదు. అయితే యువతి ఇంట్లో ఒంటరిగా ఉండటం... పైగా అంథురాలు కావడంతో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. రాజు వేధింపులు క్రమక్రమంగా పెరగడంతో ఈ విషయాన్ని యువతి తన తల్లికి, పెద్దమ్మకు చెప్పింది. దీంతో రాజును యువతి తల్లి నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాణిపై రాజు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న యువకుడు అక్కడే ఉన్న గొడ్డలితో రాణిపై దాడి చేసి నరికాడు. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన వెంటనే రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. కళ్లు కనిపించని తమ బిడ్డని చంపిన రాజుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2023-02-13T17:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising