ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై రౌండ్‌ టేబుల్‌ మీటింగ్.. గందరగోళం

ABN, First Publish Date - 2023-04-19T13:51:37+05:30

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో గందరగోళం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసే విషయంలో నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. భవిష్యత్తు కార్యాచరణపై సీపీఐ రామకృష్ణ (CPI Ramakrishna), వైసీపీ నేత గౌతంరెడ్డి (YCP Leader Gowtam Reddy)మధ్య వాదోపవాదాలు జరిగాయి. సీఎం హోదాలో జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS jaganmohan Reddy) ప్రధానిని (PM Modi) కలిసేలా బాధ్యత తీసుకోవాలని టీడీపీ నేత దేవినేని ఉమ (TDP Leader Devineni Uma) అన్నారు. గతంలో వాజపేయి (Atal Bihari Vajpayee) హయాంలో చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) ఇలాగే ప్రైవేటీకరణ అడ్డుకున్నారన్న విషయాన్ని ఉమ గుర్తుచేశారు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి (AP CM) కూడా ఇలాగే బాధ్యత తీసుకోవాలని దేవినేని, రామకృష్ణ డిమాండ్ చేశారు.

అయితే వారి వ్యాఖ్యలపై వైసీపీ నేత గౌతంరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ భవిష్యత్తు కార్యాచరణ చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. అయితే తాము చేసేవి విమర్శలు కాదని ప్రభుత్వానికి తమ‌ విజ్ఞప్తి అని రామకృష్ణ స్పష్టం చేశారు. నేతల మధ్య వాగ్వివాదంతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభాధ్యక్షులు ఓబులేసు అందరికీ సర్ది చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పోరాటంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు భాగస్వామ్యం కావాలన్న తీర్మానానికి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోద ముద్ర పడింది.

Updated Date - 2023-04-19T13:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising