Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
ABN, Publish Date - Dec 24 , 2023 | 08:21 AM
నంద్యాల జిల్లా: ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది.
నంద్యాల జిల్లా: ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. ఆదివారం వేకువజామున నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శివనామ స్మరణతో శ్రీశైలం మారుమ్రోతోంది.
కాగా శ్రీశైలం మహాక్షేత్రంలో ఆర్జిత అభిషేకాలను మూడు రోజుల పాటు నిలిపివేయనున్నట్టు దేవస్థానం ఈవో పెద్దిరాజు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి, వారాంతపు సెలవుల కారణంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 23, 24, 25 తేదీల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అభిషేకాలకు ప్రత్యామ్నాయంగా రోజుకు నాలుగు విడతల్లో మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. స్పర్శ దర్శనం టికెట్లను దేవస్థానం వైబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం, వారంతపు సెలవులు కావడంతో భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో వివరించారు.
Updated Date - Dec 24 , 2023 | 08:21 AM