Kurnool: యువనేత లోకేష్‌ను కలిసి కన్నీరుమున్నీరైన ఖాసింబీ
ABN, First Publish Date - 2023-04-19T10:41:57+05:30
కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 75వ రోజుకు చేరుకుంది.
కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) బుధవారం నాటికి 75వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది. కుప్పాల దొడ్డిలో చిరుమాను దొడ్డి గ్రామస్తురాలు ఖాంసింభీ యువనేత లోకేష్‌ను కలిసి తమ కష్టాలు చెప్పుకొని కన్నీరుమున్నీరైంది. తన భర్త రైతు కింజారి రంజన్ గత నెల 31న ఆత్మహత్య చేసుకున్నాడని, గత రెండేళ్లుగా నకిలీ విత్తనాలు, పురుగుల మందులతో పంటనష్టం వచ్చిందని వాపోయింది. సుమారు రూ.9 లక్షలు అప్పుల పాలయ్యామని, వడ్డీలు కట్టలేని పరిస్థితి రావడంతో.. తన భర్త మానసిక ఒత్తిడితో పొలంలోనే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించింది.
బాకీ తీర్చాలని అప్పులవాళ్లు తమపై ఒత్తిడి చేస్తున్నారని, జిల్లా కలెక్టర్‌ను కలిసినా ప్రభుత్వం నుండి నేటికీ పరిహారం అందలేదని ఖాసింబీ తెలిపింది. ‘మా కుటుంబాన్ని మీరే ఆదుకోవాలి సార్’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించి లోకేష్ మాట్లాడుతూ... జగన్ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఖాసింబీ కుటుంబమే ఇందుకు ఉదాహరణ అన్నారు. అస్తవ్యస్త విధానాల కారణంగా దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఖాసింబీ కుటుంబానికి పరిహారం కోసం ప్రభుత్వానికి లేఖరాసి పరిహారం అందేలా కృషిచేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
Updated Date - 2023-04-19T10:41:57+05:30 IST