Kurnool Dist.: ఎమ్మిగనూరు పట్టణంలో లోకేష్ పాదయాత్ర
ABN, First Publish Date - 2023-04-30T08:37:01+05:30
కర్నూలు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 85వ రోజుకు చేరుకుంది.
కర్నూలు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 85వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణంలో పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్బంగా పలు సామాజిక వర్గీయులతో లోకేష్ భేటీకానున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఎమ్మిగనూరులోని చేనేత సహకార సంఘం మైదానంలో నారా లోకేష్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
కాగా నిన్న అప్పటి వరకూ భగ భగమండిన ఎండలు... ప్రజల కష్టాలు కళ్లారా చూడాలని పాదయాత్ర చేపట్టిన యువనేత తపనను ప్రకృతి అర్థం చేసుకుందేమో.. అంతలోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చినుకులతో మొదలై వర్షంగా మారింది. ప్రజల అభిమాన వర్షమూ అలాగే కురిసింది. వానలోనే యువనేత పాదయాత్ర చేస్తూ... వివిధ వర్గాల సమస్యలు తెలుసుకుంటుంటే... టీడీపీ (TDP) శ్రేణులూ ఆయన వెంట కదిలాయి. జోరువానలోనూ నారా లోకేశ్ (Nara Lokesh) పాదయాత్ర కొనసాగింది. ఎమ్మిగనూరు (Yemmiganur)లో లోకేశ్‌ను వడ్డెర సామాజిక వర్గీయులు కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుదేనని తెలిపారు. బీసీలను బ్యాంక్ బోన్ అన్న సీఎం జగన్ (CM Jagan).. నేడు వాళ్ల బ్యాక్ బోన్ విరుస్తున్నారని దుయ్యబట్టారు. వడ్డెర్ల నుంచి వైసీపీ నేతలు లాక్కున్న క్వారీలను తిరిగి అప్పగిస్తామని ప్రకటించారు. విధులు, నిధులు, కనీసం కుర్చీలూ లేని కార్పొరేషన్లు ఇచ్చి జగన్ మోసం చేశారని లోకేశ్ మండిపడ్డారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని తాము తలపెడితే.. వైసీపీ నిలిపేసిందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తి చేస్తామని ప్రకటించారు. దామాషా ప్రకారం వడ్డెర కార్పొరేషన్‌కు నిధులు కేటాయిస్తామని, వడ్డెర్లకు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
Updated Date - 2023-04-30T08:37:01+05:30 IST