ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Minister: ముందస్తు ఎన్నికలపై మంత్రి కొట్టు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-08-24T12:20:23+05:30

ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు.

నంద్యాల: ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Kottu Satyanarayana) స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావాలసిన అవసరం లేదని.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు.


మంత్రి ఇంకా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉందని అందుకే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండలేదని తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండాలని రేపటి (శుక్రవారం) నుంచి ఏడు రోజులపాటు శ్రీశైలం ఆలయంలో వరుణ యాగాలు, జపాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రానికి ఏడు ఐఎస్ఓ సర్టిఫికెట్లు వచ్చాయని.. అంతర్జాతీయ గుర్తింపు ఐఎస్ఓ ద్వారా రావడం సంతోషంగా ఉందన్నారు. శ్రీశైలం క్షేత్రంలో పెద్ద ఎత్తున జరుగనున్న అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేనెలలో సీఎం జగన్ శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. శ్రీశైలం క్షేత్రం పరిధిలో చిరుత పులులు, ఎలుగుబంట్లు, వన్యప్రాణులు రాకుండా చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-08-24T12:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising