ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh: జగన్ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టవు...

ABN, First Publish Date - 2023-05-14T10:22:07+05:30

నంద్యాల: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) ఆదివారం ఉదయం శ్రీశైలం (SriSailam) నియోజకవర్గంలో ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) ఆదివారం ఉదయం శ్రీశైలం (SriSailam) నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలగాము వద్ద కొత్త రామాపురం గ్రామస్తులతో సమావేశం అయ్యారు. గ్రామస్తులు యువనేత లోకేష్‌కు సమస్యలను విన్నవించారు. గత ప్రభుత్వం నిర్మించిన సిద్దాపురం చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మా పొలాలకు పిల్లకాల్వలు తీయించాలన్నారు. అలాగే రైతులకు ఇచ్చిన డ్రిప్స్, స్ప్రింక్లర్లు, నల్లపట్టాలు, స్ప్రేయర్లు, సబ్సిడీపై ట్రాక్టర్లు ప్రస్తుత ప్రభుత్వం రద్దుచేసిందని.. వాటిని పునరుద్దరించాలని కోరారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన సిసి రోడ్ల నిర్మాణపనులను ఇంతవరకు పూర్తిచేయలేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మిగిలిపోయిన రోడ్లు పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలులేవని, గత ప్రభుత్వంలో మాదిరి మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.

వారి సమస్యలపై స్పందించిన లోకేష్ మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతుల సమస్యలు పట్టడంలేదని విమర్శించారు. సీఎం ముఖం చూసి రాష్ట్రంలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిద్దాపురం లిఫ్ట్‌కు అనుబంధంగా పిల్లకాల్వల పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు విధానాన్ని పునఃప్రారంభించి, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలుచేస్తామన్నారు. పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-14T10:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising