ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinash reddy KA Paul: కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి కేఏపాల్.. ఏం చేశారంటే...

ABN, First Publish Date - 2023-05-25T16:18:38+05:30

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను

KA Paul
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash reddy) తల్లి లక్ష్మిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను కేఏపాల్ అడిగి తెలుసుకున్నారు. గుండెపోటు రావడంతో కొద్దిరోజులుగా లక్ష్మీ విశ్వభారతి ఆస్పత్రిలో (ViswaBharathi hospital) చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ, మేనత్త విమలారెడ్డితోపాటు పలువురు ఆమెను పరామర్శించారు. తాజాగా కేఏపాల్ (Prajashanti party chief KA Paul) కూడా ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించారు.

కాగా... కొద్ది రోజులుగా విశ్వభారతి ఆస్పత్రి దగ్గర హైడ్రామా నడుస్తోంది. వైఎస్.వివేకా హత్య కేసులో పలుమార్లు అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. కానీ ఆయా కారణాల చేత విచారణకు హాజరుకాలేదు. ఇలా జరుగుతుండగా తల్లి అనారోగ్యానికి గురి కావడంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో తల్లి ఆరోగ్యం బాగోలేని కారణాన విచారణకు హాజరుకాలేనని అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. ఇలా జరుగుతుండగానే సీబీఐ అధికారులు.. కర్నూలుకు చేరుకుని జిల్లా ఎస్పీని కలిసి అరెస్ట్‌కు సహకరించాలని కోరారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు ఆస్పత్రి దగ్గర అవినాష్‌రెడ్డి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇంకోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించి అటు వైపు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉంటుండగా ముందస్తు బెయిల్ కోసం అవినాష్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ చుక్కెదురైంది. హైకోర్టులో వేసుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీంతో అవినాష్‌రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్‌ను విచారించనుంది.

Updated Date - 2023-05-25T16:27:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising