Srisailam Temple: శ్రీశైలంలో శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకం ప్రారంభం
ABN, First Publish Date - 2023-06-29T11:16:11+05:30
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది.
నంద్యాల: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సహస్ర ఘటాభిషేకంలో భాగంగా ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఘటాభిషేకానికి మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమీషనర్ సత్యనారాయణ పాతాళగంగ నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చారు. పవిత్ర జలాలతో స్వామివారికి జరిగే ఘటాభిషేకం పూజలో మంత్రి కొట్టు, కమీషనర్ సత్యనారాయణ, చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. సహస్ర ఘటాభిషేకం సందర్భంగా ఆలయంలో జరిగే అన్ని అర్జిత సేవలు నిలిపివేశారు. అలాగే స్వామివారి దర్శనాలను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. వర్షాలు కురిసి పంటలు పండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో దేవస్థానం ఘటాభిషేకం నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 12 మల్లికార్జునస్వామి వారికి ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.
Updated Date - 2023-06-29T11:19:08+05:30 IST