ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool Dist.: రాంపల్లిలో లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన టీడీపీ నేతలు..

ABN, First Publish Date - 2023-04-16T09:33:48+05:30

కర్నూలు: యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆదివారం రాంపల్లిలో లోకేష్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు, యువత, వృద్దులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగుతూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, వైసీపీ ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచేసిందని, వచ్చే ఆదాయంతో బ్రతకడం కష్టంగా మారిందని మహిళలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఊర్లో పనులు లేక వలస పోతున్నారంటూ తమ గ్రామంలో ఉన్న సమస్యలను వెల్లడించారు. వారి సమస్యలపై సానుకూలంగా లోకేష్ స్పందించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని చెప్పారు. అలాగే జగన్ పెంచిన పన్నుల భారాన్ని కూడా తగ్గిస్తామంటూ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

తర్వాత రామకొండ క్రాస్ దగ్గర నారా లోకేష్ యువకులతో సమావేశం కానున్నారు. అనంతరం మారెళ్లలో రైతులతో సమావేశమవుతారు. అలాగే మారెళ్ల శివార్లలో బీసీలతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు యువగళం పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఎంకే కొట్టాల వద్ద నారా లోకేష్ రాత్రి బస చేయనున్నారు.

Updated Date - 2023-04-16T09:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising