ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LOKESH: ఆంధ్రా అంటేనే పెట్టుబడిదారుల్లో భయం

ABN, First Publish Date - 2023-03-07T01:07:51+05:30

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అంటేనే పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ప్రభుత్వ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఉన్న పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. 2024లో అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వైసీపీ ప్రభుత్వ వేధింపులే కారణం

ఉన్న పరిశ్రమలూ వెళ్లిపోతున్నాయి

మూడు రెట్లు పెరిగిన నిరుద్యోగ సమస్య

చంద్రబాబు ఇమేజ్‌తో మళ్లీ పెట్టుబడులు రప్పిస్తాం

బీసీల కోసం అట్రాసిటీ తరహా చట్టం తెస్తాం

నేతన్నల కోసం మంగళగిరిలో పైలెట్‌ ప్రాజెక్టు: లోకేశ్‌

రాయచోటి (ఆంధ్రజ్యోతి), పీలేరు, మార్చి 6: ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అంటేనే పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ప్రభుత్వ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఉన్న పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. 2024లో అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. చంద్రబాబు బ్రాండ్‌ ఇమేజ్‌తో రాష్ట్రానికి పెట్టుబడులు రప్పిస్తాం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో 36వ రోజైన సోమవారం అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపులబైలులో లోకేశ్‌ బీసీ సదస్సు నిర్వహించారు. బీసీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కురబ, వాల్మీకి, చేనేత, నాయీబ్రాహ్మణ, బెస్త, వడ్డెర, రజక కులాలకు చెందిన పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. లోకేశ్‌తో మాట్లాడిన తర్వాత 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే తమకు మంచి రోజులు వస్తాయన్న భరోసా కలిగిందని పలువురు బీసీ నేతలు వ్యాఖ్యానించారు. అలాగే గత టీడీపీ పాలనలో రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమల వివరాలను విలేకరుల సమావేశంలో లోకేశ్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో లోకేశ్‌ చెప్పినవి ఆయన మాటల్లోనే...

మేం తెచ్చిన పరిశ్రమలివీ..

అనంతపురం జిల్లాకు కియా, బెర్జర్‌ పెయింట్స్‌, జాకీ పరిశ్రమలు తెచ్చాం. కడపకు వెల్‌స్పన్‌ కంపెనీ, చిత్తూరుకు టీసీఎల్‌, ఫ్యాక్స్‌కాన్‌, సెల్‌కాన్‌, మైక్రోమ్యాక్స్‌, డిక్సన్‌, కర్నూలుకు సిమెంటు కంపెనీలు, సోలార్‌ ఉత్పత్తి కేంద్రాలు తెచ్చాం. నెల్లూరులో హీరో మోటార్స్‌, అపోలో టైర్స్‌, సుజల వంటి వందలాది పరిశ్రమలు తెచ్చాం. ప్రకాశంలో ఏషియన్‌ పేపర్‌ మిల్స్‌, గుంటూరు, కృష్ణాలకు అశోక్‌లేలాండ్‌, కేసీపీ, హెచ్‌సీఎల్‌ పరిశ్రమలు తెచ్చాం. ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక ఫిషరీస్‌, ఫార్మా కంపెనీలు తెచ్చాం. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అనేక ఐటీ పరిశ్రమలు, అదానీ డేటా సెంటర్‌తో ఒప్పందం, లులు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌, కాంజియంట్‌ వంటి పెద్ద కంపెనీలు తెచ్చాం. వైసీపీలో వచ్చిన ఒక్క కంపెనీ ముందైనా సెల్ఫీ తీసి పెట్టమని నేను విసిరిన సవాలుకు జగన్‌రెడ్డి ఇంతవరకు స్పందించలేదు. వైసీపీ పాలనలో పెద్దఎత్తున పీపీఏలు రద్దు చేసి అనేక పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేసింది. పీపీఏల రద్దు వల్ల దేశం పరువు పోతుందని కేంద్రం చెప్పినా జగన్‌ రెడ్డి పట్టించుకోలేదు.

విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో 378 ఎంవోయూలు జరిగాయని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 70 కంపెనీల పేర్లు మాత్రమే బయటపెడుతోంది. ఎంవోయూ కుదుర్చుకున్నామంటున్న ఇండోసోల్‌ కంపెనీ సీఎం జగన్‌దే. అందులోని డైరెక్టర్లందరూ పులివెందులకు చెందిన వారే. 2022లో రిజిస్టర్‌ అయిన ఈ కంపెనీ మూలధన పెట్టుబడి రూ.లక్ష మాత్రమే. ఇటువంటి కంపెనీ 76 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెబితే ఎలా నమ్మాలి? ఏబీసీ అనే మరో కంపెనీ టర్నోవర్‌ రూ.120 కోట్లు. అందులో 250 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ సంస్థ 1.20 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుందంటే ఎలా నమ్మాలి? ఈ సమ్మిట్‌ పేరుతో ప్రజాధనాన్ని, భూములను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమ్మిట్‌ వల్ల మన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు.

బీసీల కోసం ప్రత్యేక చట్టం

బీసీలను బ్యాక్‌బోన్‌ క్లాసె్‌సగా అభివర్ణించిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత వారి బ్యాక్‌ బోన్‌ను విరగ్గొట్టారు. 50 బీసీ ఉపకులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ప్రగల్బాలు పలుకుతున్న ముఖ్యమంత్రి వాటికి రూపాయి కూడా నిధులివ్వలేదు. కార్పొరేషన్లు ఫుల్‌, నిధులు నిల్‌. పలు కార్పొరేషన్‌ డైరెక్టర్లకు జీతాలు చెల్లించి ఆరు నెలలు అవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీల కోసం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో ప్రత్యేక చట్టం తెస్తాం. పవర్‌లూమ్స్‌ ధాటికి ఉనికి కోల్పోతున్న మగ్గాలను కాపాడేందుకు మంగళగిరి నియోజకవర్గంలో టాటా సంస్థతో కలిసి ప్రయోగాత్మకంగా ఓ ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. అక్కడ సఫలీకృతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం.

బాబాయినే లేపేసినోడు..

రెడ్డి సోదరులకు న్యాయం చేస్తాడా?

లోకేశ్‌ పాదయాత్ర 36వ రోజు డైరీ

ఈరోజు పీలేరు సమీపంలోని వేపులబయలు నుంచి పాదయాత్ర ప్రారంభించాను. పెదబయలు వద్ద బీసీ వర్గీయులతో సమావేశమయ్యాను. రాష్ట్రంలోని రెడ్డి సోదరులందరికీ నేను చెప్పేది ఒక్కటే. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆ నలుగురు రెడ్లు తప్ప ఎవరైనా బాగుపడిన దాఖలాలు ఉన్నాయా? పైగా స్వార్థ రాజకీయం కోసం సొంత బాబాయిని హతమార్చిన కిరాతకుడు మీకెలా న్యాయం చేయగలడో ఆలోచించండి.

బాబాయ్‌ హత్యలో అబ్బాయే ముద్దాయి!

కలికిరి, మార్చి 6: పులివెందుల బాబాయి హత్య కేసులో ప్రధాన ముద్దాయి జగన్‌రెడ్డేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆరోపించారు. నిర్మాత, దర్శకుడు, విలన్‌ అన్నీ తానై కథ నడిపాడని అన్నారు. ఈ హత్యను చంద్రబాబు పైకి నెట్టేందుకు భారీ స్ర్కిప్టుతో బయల్దేరితే ప్రజలు కూడా నమ్మేశారని చెప్పారు. ఒక కన్ను మరో కన్నును పొడుస్తాదా అంటూ వింత వాదన చేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు కోడి కత్తి డ్రామా కూడా తెలిసిందేనన్నారు. అదే విధంగా ఈసారి కూడా కొత్త కథ, కొత్త రకం స్ర్కిప్ట్‌తో దగా చేయడానికి వస్తాడని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపిచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా 36వ రోజు సోమవారం ఆయన అన్నమయ్య జిల్లా కలికిరి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ రాత్రి బస చేస్తున్న ప్రదేశం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముందస్తు పర్యటనలో ఈ సభ లేకపోయినా అనూహ్య రీతిలో అశేషంగా తరలివచ్చిన వేలాది మందితో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దీంతో అప్పడికప్పుడే ఇది బహిరంగ సభగా మారిపోయింది.

2019 వరకూ తనపై ఒక్క కేసు కూడా లేదని.. ఇప్పుడు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీతో సహా 20 కేసులున్నాయని గర్వంగా చెబుతున్నానని లోకేశ్‌ అన్నారు. అయినా తగ్గేదే లేదని చెప్పారు. తన పాదయాత్రను చూసి జగన్‌ వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. పోలీసులు తన పాదయాత్రకు విపరీతంగా కష్టపడుతున్నారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కో కానిస్టేబుల్‌కు రావలసిన రూ.75 వేల అరియర్స్‌ను, మెడికల్‌ బిల్లులకు విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్‌ సోమవారం 14.2 కి.మీ. నడిచారు. మొత్తం 472.7 కి.మీ. నడక పూర్తయింది.

Updated Date - 2023-03-07T04:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising