ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh: 917 కి.మీలు చేరిన లోకేశ్‌ పాదయాత్ర

ABN, First Publish Date - 2023-04-15T21:02:38+05:30

టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) పాదయాత్ర 72 రోజులు పూర్తి చేసుకుంది. శనివారం నంద్యాల జిల్లా (Nandyala District) డోన్‌ నియోజకవర్గం ప్యాపిలి మండలంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నంద్యాల: టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) పాదయాత్ర 72 రోజులు పూర్తి చేసుకుంది. శనివారం నంద్యాల జిల్లా (Nandyala District) డోన్‌ నియోజకవర్గం ప్యాపిలి మండలంలోని కలచట్ల సమీపంలో మొదలైంది. కలచట్ల, ఎస్‌.రంగాపురం దాటగానే తుగ్గలి మండలం శభాష్‌పురం వద్ద కర్నూలు జిల్లా (Kurnool District) పత్తికొండ నియోజకవర్గంలోకి అడుగు పెట్టింది. అక్కడి నుంచి రాంపల్లి క్రాస్‌కు చేరుకుని బహిరంగ సభలో లోకేశ్‌ పాల్గొన్నారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో లోకేశ్‌ బస చేశారు. ఈ రోజు 14.7 కి.మీలు నడిచారు. మొత్తం 917.6 కి.మీలకు పాదయాత్ర చేరుకుంది. దారి పొడవున జనం జేజేలు పలుకుతూ యువనేతకు నీరాజనాలు పలికారు. రహదారులు జనవారదులయ్యాయి.

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

బీసీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 25వేల అక్రమ కేసులు బీసీలపై నమోదయ్యాయని లోకేశ్‌ గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకు వస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పది శాతం రిజర్వేషన్లు కట్‌ చేసి 16,500 మంది పదవులకు దూరం చేశారన్నారు. పవర్‌లేని కార్పొరేషన్లు, కుర్చీలు లేని ఫెడరేషన్లు మాత్రమే ఇచ్చారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే శాశ్వత కుల ధ్రువీకరణపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు.

దళితులపై ఆగని దమనకాండ

వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దమనకాండ సాగుతోందని లోకేశ్‌ పేర్కొన్నారు. డా.సుధాకర్‌ నుంచి మొదలుకుని డా.అచ్చెన్న వరకు దళితులు హత్యకు గురవుతున్నారని తెలిపారు. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్‌కు గుండు కొట్టించారు. మాస్కు పెట్టుకోలేదని కిరణ్‌ను కొట్టి చంపారు. జగన్‌ లిక్కర్‌ స్కాంపై పోరాడినందుకు ఓంప్రతాప్‌ను చంపేశారు. పెద్దిరెడ్డి అవినీతిపై పోరాడినందుకు జడ్జి రామకృష్ణను హింసిస్తున్నారని తెలిపారు. జగన్‌ గొప్ప డ్రామా ఆర్టిస్టు అని, త్రిపుల్‌ ఆర్‌లో నటించి ఉంటే ఆస్కార్‌ అవార్డు వచ్చేదని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-04-15T21:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising