Nara Lokesh: చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీని ప్రశ్నించిన లోకేష్
ABN, First Publish Date - 2023-10-14T17:47:28+05:30
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ (DIG) రవి కిరణ్‌ను టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రశ్నించారు.
ఢిల్లీ: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ (DIG) రవి కిరణ్‌ను టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రశ్నించారు.
ములాఖత్ అనంతరం చంద్రబాబు ఆరోగ్యంపై అక్కడే డీఐజీని లోకేష్ గట్టిగా ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను చూపించి చంద్రబాబు అనారోగ్యంపై డీఐజీని లోకేష్ నిలదీశారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ఓ పక్క స్పష్టంగా నివేదిక ఉన్నప్పటికీ....ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీఐజీ ప్రకటనలు ఇవ్వడాన్ని లోకేష్ ప్రశ్నించారు.చంద్రబాబుకు సౌకర్యాలపై అధికారులకు వైద్యులు సూచన చేసి 48 గంటలు దాటినా ఎందుకు అమలు చేయలేదని లోకేష్ ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. డీ హైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును చల్లని వాతావరణంలో పెట్టాలన్న వైద్యుల సూచనలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వైద్యుల సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా చెప్పండి అంటూ లోకేష్ డీఐజీని నిలదీశారు. చంద్రబాబు అనారోగ్యంపైనా దాచిపెట్టడం, డాక్టర్ నివేదికలు తొక్కి పట్టడంపై లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోకేష్ ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ములాఖాత్ సమయం అయిపోయిందని, వెంటనే వెళ్ళాలి అంటూ DIG రవి కిరణ్ దురుసుగా వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-10-14T17:52:47+05:30 IST