YuvagalamPadayatra: బెంజి మంత్రీ.. బీపీ, బూతులు ఎందుకు...?: నారా లోకేశ్
ABN, First Publish Date - 2023-04-21T19:32:54+05:30
బెంజి మంత్రి (Minister Jayaram) జయరాం గారూ... నేను మిమల్ని నేరుగా అడుగుతున్నా.. ప్రభుత్వ ధర చెల్లించి ఆ భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్..
కర్నూలు: ‘‘బెంజి మంత్రి (Minister Jayaram) జయరాం గారూ... నేను మిమల్ని నేరుగా అడుగుతున్నా.. ప్రభుత్వ ధర చెల్లించి ఆ భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ (Registration) చేయించడానికి మేము సిద్ధం.. మీరు అక్రమంగా కొట్టేసిన భూములు వెనక్కి ఇవ్వడానికి సిద్ధమా..?’’ అని నారా లోకేశ్ సవాల్ విసిరారు. ‘‘నేను అడిగిన దానికి తప్ప ప్రపంచంలో ఉన్న మిగిలిన విషయాలు మాట్లాడితే నోరు పారేసుకోవడం ఎందుకు.? ఈఎస్‌ఐ (ESI) మందుల కొనుగోళ్ల స్కాంకి పాల్పడి మీరు బెంజ్ కారు గిఫ్ట్ (Benz car gift)గా తీసుకున్నారని, ఆధారాలతో సహా బయటపెట్టాం. అదే కారులో మీ ముద్దుల కుమారుడు షికార్లు కొట్టడం రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఈఎస్‌ఐ స్కాంపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వంలో ఉన్నది మీరు. ఆ విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నారు. మీకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి. బెంజి మంత్రి గారూ మీ ఆవు కథలు ఆపండి. నేను నా సవాల్‌కు కట్టుబడి ఉన్నాను. ఎవరైనా ముందుకు వస్తే భూములు రైతుల పేరిట రాయడానికి సిద్ధమని మీరే బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు వెనక్కి తగ్గి బూతులతో విరుచుకుపడుతున్నారు’’ అని లోకేశ్ నిలదీశారు. మంత్రి జయరాం వందల ఎకరాలకు అధిపతి అయ్యారని, జిల్లాలోని ఒక్క వాల్మీకి కుటుంబం అయినా ఒక్క ఎకరం భూమి అయినా కొనే స్థితిలో ఉందా అని ప్రశ్నించారు. ఆయన బెంజి కారులో విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు... జిల్లాలో ఉన్న ఒక్క వాల్మీకి కుంటుంబం అయినా చిన్న కారు కొనే స్థితిలో ఉన్నారా అని లోకేశ్ నిలదీశారు.
Updated Date - 2023-04-21T19:32:54+05:30 IST