ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanna Lakshminarayana: 18న మహా ధర్నా: మాజీ మంత్రి కన్నా

ABN, First Publish Date - 2023-04-15T15:56:46+05:30

సాగు నీటి కోసం ఈ నెల 18న నరసరావుపేట (Narasaraopeta) కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్టు టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పల్నాడు: సాగు నీటి కోసం ఈ నెల 18న నరసరావుపేట (Narasaraopeta) కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్టు టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) తెలిపారు. సాగు నీరు ఇచ్చి పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం ఆ పని చేయక పోవటం వల్ల తాము మహాధర్నా (Maha Dharna) చేపడుతున్నట్టు చెప్పారు. నీటి కోసం ఆందోళన చేపట్టిన వారిపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం తాము చేయాల్సిన పని చేయక పోగా న్యాయం చేయాలని కోరిన వారిపై కేసులు నమోదు చేయడం ఏమిటని? కన్నా ప్రశ్నించారు. రైతులు నష్టపోతున్నా దున్నపోతు మీద వానపడ్డట్లుగా ప్రభుత్వ తీరు ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే సాగునీరు విడుదల చేయాలని కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు.

సాగర్‌ కుడి కాలువ అయకట్టు పరిధిలోని పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం (Guntur Prakasam) జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాల్లో వరి పంట ఉందని జలవనరుల శాఖ అంచనా వేసింది. ఒక్క పల్నాడు జిల్లాలోనే 47,690 ఎకరాల్లో రెండో పంట వరి సాగు చేశారు. ప్రస్తుతం పంట కంకి వెళ్లి గింజపోసుకుంటోంది. ఈ తరుణంలో పంటకు నీరు ఎక్కువగా అవసరం ఉంది. నీరు లేకుంటే కంకి గింజపోసుకోకుండా తాలుగా మారుతుంది. కీలక సమయంలో సాగర్‌ కుడి కాలువకు నీటి సరఫరాను నిలిపివేయడంలో రైతులు తీవ్ర అవేదన చెందుతున్నారు. ఈ నెలాఖరు వరకు నీరు ఇస్తే పంట చేతికి వస్తుందని రైతులు చెబుతున్నారు. జలవనరుల శాఖ నీటి సరఫరా విషయంలో ఎటు తేల్చకపోతుండటంలో రైతులకు కంటిపై కునుకు లేదు. పంట కళ్లేదుట ఎండుతుండటంతో రైతులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. అన్నదాతలు వారి ప్రాంతాలల్లోని ఎమ్మెల్యేలను కలసి సాగు నీరు ఇప్పించాలని మొర పెట్టుకుంటున్నారు. జలవనరుల శాఖ మంత్రి అంబటిని కూడా కలసి నీరు ఇవ్వాలని వేడుకుంటున్నారు. రైతుల (Farmers) మొర అలకించే స్థితిలో పాలకులు లేరు. వారు పార్టీ స్టిక్కర్లు అంటించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప సాగునీటి సరఫరా కోసం కృషి చేస్తున్నా దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో వారు ఉద్యమబాట పడుతున్నారు. పల్నాడు జిల్లాలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడెక్కి రాస్తారోకోలు నిర్వహించారు. పంట ఎండుతుండటంతో రైతులు ఉద్యమాన్ని ఉదృతం చేసే దిశగా పయనిస్తున్నారు. జలవనరుల శాఖ కుడి కాలువ పరిధిలోని అధికారులు ఉన్నతాధికారుల పంటల పరిస్ధితిపై నివేదికలు పంపారు. ఈఎన్‌సీకి పూర్తి వివరాలను అందజేశారు. నీటి విడుదలపై ఉన్నతాధికారులు ప్రభుత్వంతో చర్చిస్తున్నారని వారు తెలిపారు. అయకట్టులో పంట పరిస్ధితి అందరికి తెలిసిందేనని నీటి విడుదలపై వారంలో ఒక నిర్ణయం రావచ్చని వారు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంకు కూడా నీటి విడుదలకై ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే నీటి విడుదల జరిగే పరిస్ధితి. నేటి వరకు ప్రభుత్వం నీటి విడుదలపై ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో నీటి విడుదల సందిగ్ధంలోనే ఉంది. ఎండి పోతున్న వరి పంటను కాపాడేందుకు తక్షణమే ప్రభుత్వం స్పందించి నీటి విడదల చేసి తమను అదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. సాగర్‌ జలాశంయంలో 590 అడుగులు పూర్తి స్ధాయి నీటి మట్టం కాగా గురువారం 526.9 అడుగులు నీటి మట్టం నమోదైంది. 312.05 టీఎంపీల నీటి సామర్ధ్యం కాగా 162.16 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

Updated Date - 2023-04-15T15:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising