ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maha shivratri: శివనామస్మరణతో మార్మోగిన శ్రీకాళహస్తి

ABN, First Publish Date - 2023-02-18T20:14:48+05:30

మహాశివరాత్రి (Maha shivratri) పర్వదినాన దక్షిణకైలాసంగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి (Srikalahasti) క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి: మహాశివరాత్రి (Maha shivratri) పర్వదినాన దక్షిణకైలాసంగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి (Srikalahasti) క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. శనివారం వేకువజామున 2గంటల నుంచి రాత్రి వరకు శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తజనంతో కిటకిటలాడింది. స్వయంభువుగా వెలసిన వాయు లింగేశ్వరస్వామి నిత్యాభిషేక మూర్తిగా భక్త జనానికి దర్శనమిచ్చారు. ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు ఇంద్ర విమానంపై, ఆయన దేవేరి జ్ఞానప్రసూనాంబదేవి చప్పరంపై పురవిహారం చేశారు. మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై వల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప ముందు సాగగా దివ్యాభరణాల ధగధగలతో పురవిహారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో చతుర్మాడవీధులు నిండిపోయాయి.

రాత్రి స్వామివారు నంది వాహనం, జ్ఞానప్రసూనాంబదేవి సింహ వాహనంపై అధిరోహించి పురవిహారం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లను సుమారు లక్షన్నర మంది భక్తులు దర్శించుకుని ఉంటారని అధికారులు అంచనా వేశారు.రద్దీ నేపథ్యంలో ఆలయంలో మహాలఘు దర్శనం ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. శివరాత్రి సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

Updated Date - 2023-02-18T20:14:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising