చంద్రబాబును అరెస్టు చేసి జగన్ చాలా పెద్ద తప్పు చేశారు: మజ్జి పద్మావతి
ABN, First Publish Date - 2023-10-09T13:29:57+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో తెలుగు మహిళా కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అందులో భాగంగా మోకాళ్ళపై చిన వెంకన్న మెట్లు ఎక్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏలూరు : టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో తెలుగు మహిళా కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అందులో భాగంగా మోకాళ్ళపై చిన వెంకన్న మెట్లు ఎక్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జి పద్మావతి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం చాలా దారుణమన్నారు. ఎన్నడు ఇంట్లోంచి రాని మహిళలు సైతం చంద్రబాబుకు మద్దతుగా వస్తున్నారని, చంద్రబాబును అరెస్టు చేసి సీఎం జగన్ చాలా పెద్ద తప్పు చేశారన్నారు. ఒకరోజు విశ్రాంతి ఇస్తేనే వ్యూహాలు రచించే చంద్రబాబు, 30 రోజులు విశ్రాంతి ఇవ్వడంతో కచ్చితంగా వ్యూహాలు రచించి 175 కి 175 సీట్లు సాధిస్తారనీ, అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కుతారన్నారు. ఎన్‌టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎంతటి ప్రభంజనం వచ్చిందో మళ్లీ అదే ప్రభంజనం వచ్చి చంద్రబాబుడు ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇది ప్రజలకు వైసీపీ ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధమని, తప్పకుండా ప్రజలు గెలిచి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తారని మజ్జి పద్మావతి అన్నారు.
Updated Date - 2023-10-09T13:29:57+05:30 IST