AP: మంత్రి అమర్నాథ్ నియోజకవర్గంలో దారుణం.. కస్తూర్బా బాలికల వసతి గృహాల్లో సౌకర్యాలు లేక..
ABN, First Publish Date - 2023-02-15T19:22:25+05:30
ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (minister Amarnath) నియోజకవర్గం అనకాపల్లిలో కస్తూర్బా వసతి గృహాల్లో (Kasturba girls hostels) కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రాయవరం, అనకాపల్లి జిల్లా: ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (minister Amarnath) నియోజకవర్గం అనకాపల్లిలో కస్తూర్బా వసతి గృహాల్లో (Kasturba girls hostels) కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కస్తూర్బా వసతి గృహం విద్యార్థినులు లైట్లు ఆఫ్ చేసి ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు. బీసీ రెసిడెన్షియల్స్‌లో కనీసం బాత్‌రూమ్స్, స్నానపు గదులు కూడా లేవని, బెడ్ షీట్లు అడ్డుకట్టుకొని ఆరుబయట స్నానాలు చేస్తున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన పరిస్థితిలో కస్తూర్బా బాలికల వసతి గృహం ఉందని, తాము పాస్ అవుతామని నమ్మకం కూడా లేదని విద్యార్థినులు అన్నారు.
టీచర్స్ తమకు ఏమి చెప్పడం లేదని, తల్లిదండ్రులను కల నెరవేర్చలేని స్థితిలో ఉన్నామని విద్యార్థినులు తెలిపారు. లైట్లు ఆపి వరండాలో స్నానాలు చేసుకుంటున్నామని విద్యార్థినులు బోరున విలపిస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజు పాలెంలో కస్తూర్బా బీసీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినుల కన్నీటి పర్యంతమయ్యారు. ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినుల కన్నీటి గాధ ఇదీ.. జిల్లా అధికారులు స్పందించి కస్తూర్బా వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు వేడుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
*********************************************************
మంత్రి రోజాకు నారా లోకేష్ కౌంటర్
*****************************************************
***********************************************
కల్లు రుచిచూసిన షర్మిల.. వీడియో వైరల్
********************************************
Updated Date - 2023-02-15T19:28:15+05:30 IST