AP News: మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల భేటీ
ABN, First Publish Date - 2023-08-08T13:15:59+05:30
మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశం మంగళవారం ప్రారంభమైంది.
విజయవాడ: మంత్రి బొత్స సత్యనారాయణతో (Minister Botsa Satyanarayana) ఉపాధ్యాయ సంఘాల నేతల (Teacher unions) సమావేశం మంగళవారం ప్రారంభమైంది. 12 సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని.. కస్తూర్భా పాఠశాల ఒప్పంద ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలు అమలు చేయాలి, అలాగే వారిని క్రమబద్ధీకరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. అలాగే పదోన్నతి, బదిలీలు పొందిన ఉపాధ్యాయుల సవరించిన కేడర్ వివరాలు ఆమోదించాలని, బకాయి ఉన్న జూన్, జూలై వేతనాలు చెల్లించాలంటూ ఈ అంశాలపై మంత్రితో ఉపాధ్యాయ సంఘాల నాయకులు చర్చినట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-08-08T13:15:59+05:30 IST