Michaung Cyclone: వేగంగా కదులుతున్న ‘మిచాంగ్’ తుఫాన్.. తీరం దాటేది రేపే..
ABN, First Publish Date - 2023-12-04T09:56:34+05:30
Andhrapradesh: ‘మిచాంగ్’ తుఫాన్ దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 130 కిలోమీటర్లు, నెల్లూరుకు 220 కిలోమీటర్లు, బాపట్లకు 330 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది.
అమరావతి: ‘మిచాంగ్’ తుఫాన్ (Michaung Cyclone) దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 130 కిలోమీటర్లు, నెల్లూరుకు 220 కిలోమీటర్లు, బాపట్లకు 330 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. నేడు (సోమవారం) కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్ననం నెల్లూరు - మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో నేడు, రేపు కూడ కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు కురువనున్నాయి. రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో గాలులు వచనున్నాయి. దీతోమత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్.అంబేద్కర్ హెచ్చరించారు.
Updated Date - 2023-12-04T09:56:40+05:30 IST