ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Amarnath : ఫోన్ ట్యాపింగ్ కాదు.. కాల్ రికార్డింగ్..

ABN, First Publish Date - 2023-02-01T12:36:57+05:30

నెల్లూరు రూరల్ వైసీపీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ సొంత పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ : నెల్లూరు రూరల్ వైసీపీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ సొంత పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై కాసేపటికే మంత్రి అమర్‌‌నాథ్ స్పందించారు. ‘‘ వైసీపీ నేతల మధ్య జరిగింది ట్యాపింగ్ అని ఎలా అంటాము..? కాల్ రికార్డింగ్ కావచ్చు’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అంటే మొత్తానికి కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కాకున్నా రికార్డింగ్ చేసినట్టు మంత్రి ఒప్పుకున్నట్టే కదా అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కోటం రెడ్డి వ్యాఖ్యలను మించి అమర్‌నాథ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

కోటంరెడ్డి ఏమన్నారంటే..

ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోటంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారు. ముందు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే నమ్మలేదు. సీఎం జగన్‌పై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించారు. 20 రోజుల ముందు నా ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికింది. సీఎం గానీ, సజ్జల గానీ చెప్పకుండా నా ఫోన్ ట్యాప్ చేయరు... అనుమానాలు ఉన్న చోట నేనుండాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నానని నా ఫోన్ ట్యాంపింగ్ చేశారు’’ అని పేర్కొన్నారు.

పవన్‌పై సైతం కీలక వ్యాఖ్యలు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి. మూడో పార్టీగా ఉన్న జనసేన తాను అధికారంలోకి రావాలని కోరుకోవాలి కానీ పవన్ కల్యాణ్ అలా కోరుకోవడం లేదు. 25 సీట్లులో పోటీ చేస్తే చాలు అని జనసేన అధినేత భావిస్తున్నారు. ఇలా అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ప్రశ్నించారు. తాను 600 ఎకరాలు బినామీ పేర్లతో సంపాదించానని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అది నిరూపిస్తే నేను వాటిని పవన్ కళ్యాణ్‌కు రాసిస్తానని అమర్‌నాథ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-01T12:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising